ఆర్టీసీ కార్గో సేవల్లో ‘పశ్చిమ’ భేష్
తణుకు అర్బన్: ఆర్టీసీ కార్గో సేవల్లో పశ్చిమగోదావరి జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం అభినందనీయమని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఆర్టీసీ కమర్షియల్ మేనేజర్ జి.లక్ష్మీప్రసన్న వెంకట సుబ్బారావు అన్నారు. మంగళవారం తణుకు ఆర్టీసీ డిపో ఆవరణలోని కార్గో కార్యాలయంలో కార్గో ఏజెంట్లకు ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్గో కార్యాలయాలకు వచ్చే వినియోగదారులకు సత్వరమే సేవలందించాలని, మర్యాదపూర్వక సమాధానం అందించాలని ఏజెంట్లకు సూచించారు. కార్గో సేవలపై వినియోగదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ఏజెంట్లు కృషిచేయాలన్నారు. కార్గో సేవలకు సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లా రాష్ట్రంలో 25 శాతం గ్రోత్ సాధించి మొదటి స్థానంలో ఉండడానికి జిల్లాలోని 4 డిపోల మేనేజర్లు, కార్గో ఏజెంట్ల కృషి ఫలితమేనని స్పష్టం చేశారు. కార్గో బుకింగ్ ఏజెంట్లుగా పనిచేయడానికి ఆసక్తి ఉన్న వారికి కేవలం రూ.వెయ్యి డిపాజిట్‌తో ఈ అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు. డిపో మేనేజర్ సప్పా గిరిధర్‌కుమార్, సూపరింటెండెంట్ వెన్నా రమణమూర్తి, డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ షేక్ లాల్, సింగ్ సొల్యూషన్ టీం లీడర్ నవీన్, తణుకు నియోజకవర్గ కార్గో ఏజెంట్లు పాల్గొన్నారు.
ఆర్టీసీ కమర్షియల్ మేనేజర్
జి.లక్ష్మీప్రసన్న వెంకట సుబ్బారావు
Comments
Please login to add a commentAdd a comment