ఏలూరు (టూటౌన్): ముక్కుపచ్చలారని బాలికపై అత్యాచార యత్నం చేసి ఆపై హత్య చేసిన ఘటనలో ఏలూరు జిల్లా పోక్సో కోర్టు జడ్జి ఎస్.ఉమా సునంద మంగళవారం సంచలన తీర్పు ఇచ్చారు. గణపవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రైమ్ నెంబర్ 38/2017కు సంబంధించి కేశవరం గ్రామానికి చెందిన బొడ్డు ఏసుపై నేరం రుజువు కావడంతో 302 ఐపీసీ సెక్షన్ల కింద జీవిత ఖైదు, రూ.5 వేలు జరిమానా విధించారు. సాక్ష్యాలను తారుమారు చేసిన నేపథ్యంలో 7 సంవత్సరాలు జైలు, రూ.2 వేల జరిమానా విధించారు. బాధితురాలు కుటుంబానికి రూ.రెండు లక్షలు పరిహారం చెల్లించే విధంగా న్యాయమూర్తి ఎస్.ఉమా సునంద తీర్పును వెలువరించారు. 2017 మార్చి 29న రెండున్నర సంవత్సరాల బాలిక కేశవరం గ్రామంలో సంతమార్కెట్ వద్ద ఉన్న ఇంటి బయట మంచంపై నిద్రిస్తుంది. ఆ సమయంలో బాలిక తాతయ్య బొడ్డు ఏసు(50) పక్కనే ఉన్న పంట పొలాల వద్దకు బాలికను తీసుకెళ్లి ఆమైపె అత్యాచార ప్రయత్నం చేశాడు. బాలికకు రక్తస్రావం కావడంతో ఎవరికై నా చెబుతుందనే భయంతో ఆమెను పంట బోదెలో కి పలుమార్లు తొక్కి చంపేశాడు. ఈ విషయంపై బాలిక తల్లి బొడ్డు పోచమ్మ అప్పట్లో గణపవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై అప్పటి ఎస్సై ఎం.వీరబాబు కేసు నమోదు చేయగా అప్పటి సీఐ ఎం.వెంకటేశ్వరరావు దర్యాప్తు చేశారు. ఇదేకేసులో సీఐ దుర్గాప్రసాద్ ముద్దాయిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. ఈ కేసులో తదుపరి విచారణను రిటైర్డ్ డీఎస్పీ జి.వెంకటేశ్వరరావు దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డీవీ రామాంజనేయులు తన వాదనలను వినిపించారు. సకాలంలో సాక్షులను కోర్టులో హాజరుపర్చిన సీఐ ఎంవీ సుభాష్, కోర్టు మానిటరింగ్ సెల్ సీఐ ఎం.సుబ్బారావు, ఎస్సై మణికుమార్‌లను ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment