కోళ్ల వ్యర్థాల వాహనాల సీజ్
పెదపాడు: అక్రమంగా తరలిస్తున్న 3 కోళ్ల వ్యర్థాల వాహనాలను సీజ్ చేసినట్లు పెదపాడు పోలీసులు తెలిపారు. నాయుడుగూడెం, వెంకటాపురం, రాజుపేట గ్రామాల వద్ద మూడు వాహనాల్లో కోళ్ల వ్యర్థాలు తరలిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించి వాహనాలను అదుపులోకి తీసుకుని సీజ్ చేసినట్లు పెదపాడు ఎస్సై కట్టా శారదా సతీష్ తెలిపారు. వాహన యజమాని, డ్రైవర్, చెరువు యజమానులపై చర్యలు చేపడతామన్నారు.
పాఠశాలల్లో ప్రస్తుత పనివేళలే కొనసాగించాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పాఠశాలల్లో ప్రస్తుత పనివేళలే కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి బీఏ సాల్మన్ రాజు, ఏలూరు జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు టీ రామారావు, బీ రెడ్డి దొర మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఇది ఆచరణ సాధ్యం కాదని తెలిపారు. ఉన్నత పాఠశాలల్లో చదువుకోవడానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరం నుంచి విద్యార్థులు వస్తారని, సాయంత్రం ఐదు గంటల వరకు పాఠశాలలు కొనసాగించడం వలన వారు అనేక ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. పాఠశాలల పనివేళలు పెంచడం వలన క్రీడలకు కూడా సమయం ఉండదని, వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత పనివేళలనే కొనసాగించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment