ఎక్కడికక్కడ బెల్టు షాపులు
జిల్లాలో 175 మద్యం దుకాణాలకు 61 షాపులు పట్టణ ప్రాంతాల్లో, మిగిలిన 114 షాపులు పంచాయతీల పరిధిలో ఏర్పాటు చేశారు. మద్యం దుకాణాలు లేని గ్రామాల్లో బెల్టు షాపులు, పాయింట్ల పేరిట అమ్మకాలు చేస్తున్నారు. కొన్ని చోట్ల వేలం పాటలు, మరికొన్ని చోట్ల రూ. 50 వేలు నుంచి రూ.1.5 లక్ష వరకు డిపాజిట్లు చెల్లించిన వారికి, కూటమి కార్యకర్తలకు సిండికేట్లు బెల్టు నిర్వహణ బాధ్యతలను అప్పగించినట్టు తెలుస్తోంది. చిన్న దుకాణాలు, కిళ్లీ బడ్డీల్లో బాటిళ్లు ఉంచి క్వార్టర్, బీర్ బాటిల్‌కు ఎమ్మార్పీపై అదనంగా రూ.30 నుంచి రూ.50 వరకు అమ్మకాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment