వరి కోతలు వాయిదా వేసుకోండి
ఉండి: అల్పపీడన ప్రభావం కారణంగా వరికోతలు వాయిదా వేసుకోవాలని జాయింట్ కలెక్టర్ టీ రాహుల్‌కుమార్ రెడ్డి రైతులకు సూచించారు. మంగళవారం ఉండి మండలం చిలుకూరులో కళ్లాలపై ఽతూకం వేస్తున్న ధాన్యం రాశులను ఆయన పరిశీలించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ వాతావరణం అనుకూలంగా లేని కారణంగా వరికోతలు వాయిదా వేసుకోవడం మంచిదన్నారు. ఇప్పటికే వరి కోతలు కోసిన వారు మాత్రం కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. దళారులను నమ్మి పోసవద్దని, రైతులు తమకు నచ్చిన మిల్లుకు ధాన్యం విక్రయించుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. చిలుకూరులో ధాన్యం తూకం వేసే సమయంలో 40.6 కేజీలు ఉండాల్సిన బస్తా 400 గ్రాములు అధికంగా తూకం వేయడంతో రైతులను వివరాలు అడిగారు. చినిగిన గోనె సంచుల వల్ల ఇబ్బందులు ఉంటాయని రైతులు చెప్పడంతో డీసీఎం సొసైటీ అధికారులతో మాట్లాడి గోనె సంచులకు ప్యాచ్ వర్క్స్ చేయించేందుకు చర్యలు తీసుకుంటానని ఆయన రైతులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి బీ సంధ్య, వీఆర్వో విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
రైతులకు సూచించిన జేసీ
Comments
Please login to add a commentAdd a comment