హామీల అమలు ఎప్పుడు?
మినీ అంగన్‌వాడీలు అప్‌గ్రేడ్ చేయాలి
108 ఉద్యోగుల సమ్మె బాట
ఒప్పందాలు అమలు చేయాలి
కూటమి ప్రభుత్వంలో రాజ్యాంగం ఖూనీ
కదం తొక్కిన రైతులు, కార్మికులు
● ఆత్మస్థైర్యం మెండుగా..
బుధవారం శ్రీ 27 శ్రీ నవంబర్ శ్రీ 2024
హామీలు నిలుపుకోవాలి
కూటమి ప్రభుత్వం ఎన్నిక లకు ముందు వివిధ వర్గాల ఉద్యోగులకు ఇచ్చిన హామీలు తక్షణం నిలుపుకోవాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే వలంటీర్లు, అంగన్‌వాడీ మినీ వర్కర్లు, ఆశలు, స్కీం వర్కర్లు వంటి చిరు ఉద్యోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి.
– డీఎన్‌వీడీ ప్రసాద్,
సీఐటీయూ, జిల్లా కార్యదర్శి, ఏలూరు
స్మార్ట్ మీటర్ల బిగింపు ఆపాలి
చిరు ఉద్యోగులతో పాటు రైతులు, శ్రామికులు, కర్షకులను ఇబ్బందులకు గురిచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం బాధాకరం. విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు ఆపాలని, ట్రూ అప్ చార్జీల పేరిట రూ.వేల కోట్ల భారం మోపే విధానానికి స్వస్తి పలకాలి. వీఓఏలు, ఆర్పీలు, వివిధ ప్రభుత్వ స్కీం వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి.
– బండి వెంకటేశ్వరరావు,
జిల్లా ఉపాధ్యక్షుడు, ఏఐటీయూసీ,
ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడుదాం
ఏలూరు(మెట్రో): ఏలూరు కలెక్టరేట్‌లో మంగళవారం భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాజ్యాంగ దినోత్సవం ప్రాధాన్యతను వివరించి అధికారులు, సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు. తొలుత బీ ఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి దిక్సూచిగా బీఆర్ అంబేడ్కర్ రచించిన భారత రాజ్యాంగం నిలుస్తుందన్నారు. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులతోపాటు విధులు, బాధ్యతలు కూడా ప్రజలు గుర్తెరిగి రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేయాలన్నారు. జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, డీఆర్డీఏ పీడీ ఆర్.విజయరాజు, సోషల్ వెల్ఫేర్ జేడీ వి.జయప్రకాష్, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎన్.పుష్పలత, జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఆర్.నాగరాణి తదితరులు పాల్గొన్నారు.
బకాయిలు చెల్లించాలి
ఏలూరు (టూటౌన్): ప్రభుత్వ పాఠశాలల శానిటేషన్ వర్కర్స్‌కు రావాల్సిన ఐదు నెలల బకాయిలు రూ.7.50 కోట్లు వెంటనే ఇవ్వాలని కోరుతూ స్కూల్ స్వీపర్లు కలెక్టరేట్ వద్ద మంగళవారం ధర్నా చేశారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే శానిటేషన్ వర్కర్స్ 1900 మందికి బకాయిలు వెంటనే ఇవ్వాలని కోరుతూ ఏలూరు, పెదపాడు, పెదవేగి, దెందులూరు మండలాలకు చెందిన వర్కర్స్ ధర్నాలో పాల్గొన్నారు. పస్తులతో పనులు చేయించడం సిగ్గుచేటని, స్కూల్ స్వీపర్ల ఆకలి మంటలు చల్లార్చాలని పెద్ద ఎత్తున నినదించారు. అనంతరం కలెక్టర్ కె.వెట్రిసెల్వికి సమస్యలతో కూడిన వినతిపత్రాలు సమర్పించారు. కార్యక్రమానికి యూని యన్ జిల్లా అధ్యక్షురాలు పి.దుర్గ అధ్యక్షత వహించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బి. సోమయ్య మాట్లాడుతూ ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా చోద్యం చూస్తున్నారు తప్ప, సమస్య పరిష్కారం చేయడం లేదని విమర్శించారు. నెలాఖరులోపు జీతాలు చెల్లించకపోతే డిసెంబరు ఒకటో తేదీ నుండి పనులు నిలుపుదల చేసి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ప్రజా ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇవ్వాలి
ఏలూరు(మెట్రో): లోకాయుక్త, కోర్టుల ద్వారా, ఎస్సీ, ఎస్టీ కమిషన్ ద్వారా అందిన కేసుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటానని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను హెచ్చరించారు. కలెక్టరేట్‌లో మంగళవారం లోకాయుక్త, ఎస్సీ, ఎస్టీ కమిషన్ కేసుల పరిష్కారం, రీసర్వేపై అభ్యంతరాలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా అందిన ఫిర్యాదుల పరిష్కారం, తదితర అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లోకాయుక్త, ఎస్సీ, ఎస్టీ కమిషన్ ద్వారా అందిన కేసుల పరిష్కారంపై ప్రతి వారం సంబంధిత శాఖల ఉన్నతాధికారులు మండల స్థాయి అధికారులతో సమీక్షించాలన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా అందిన ఫిర్యాదులను అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరించాలన్నారు. ఇరిగేషన్ కాలువలు, డ్రైనేజీలు, పంచాయతీ, ఆర్‌అండ్‌బీ రోడ్లు, ఆక్రమణలపై సవివరమైన నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు.
రెవెన్యూ అర్జీలు జాగ్రత్తగా పరిష్కరించాలి
ఏలూరు(మెట్రో): ప్రజల నుంచి వస్తున్న అర్జీలను నాణ్యతతో పరిష్కరించడానికి జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తుందని కలెక్టర్ కె.వెట్రిసెల్వి చెప్పారు. మంగళవారం సచివాలయం నుంచి పీజీఆర్‌ఎస్(రెవిన్యూ), ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ వెరిఫికేషన్, వాటర్ ట్యాక్స్ మ్యాడ్యూల్స్‌పై జిల్లాల కలెక్టర్లతో భూ పరిపాలన ప్రధాన కమిషనరు జి.జయలక్ష్మి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో రెవెన్యూ అంశాలకు సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకం, ఇళ్ల స్థలాలు, మ్యూటేషన్స్ తదితర అర్జీల పరిష్కార తీరును వివరించారు. అర్జీలు అందిన వెంటనే వాటిని పరిశీలించి అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కార చర్యలు తీసుకుంటున్నామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు పాల్గొన్నారు.
ఏలూరు (టూటౌన్): కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఆరు నెలలు కాకుండానే ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల వ్యాప్తంగా చిరుద్యోగులు, కూలీలు నిరసనలతో హోరెత్తిస్తున్నారు. నిత్యం వివిధ వర్గాలు, చిరుద్యోగులు కలెక్టరేట్ల నిరసన గళం వినిపిస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ ఆశ వర్కర్లు, మినీ అంగన్‌వాడీ వర్కర్లు, గ్రామ, వార్డు సచివాలయ వలంటీర్లు, 108 సిబ్బంది, వీవోఏలు, మెప్మా ఆర్పీలు, వివిధ స్కీం వర్కర్లు పోరు బాట పట్టారు.
నట్టేట ముంచారు: వలంటీర్లు
ఎన్నికల ముందు ఉత్తుత్తి హామీలు ఇచ్చి నట్టేట ముంచారంటూ వలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వలంటీర్లను విధుల్లోకి తీసుకునే పరిస్థితి లేదంటూ చెప్పడమే కాకుండా దీనికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే కారణమంటూ తప్పించుకునే వాదనను తెరమీదకు తీసుకువచ్చారు. కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ గ్రామ,వార్డు సచివాలయ వలంటీర్లు ఆందోళన బాటపట్టారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, హామీ ఇచ్చిన విధంగా రూ.10 వేల జీతం ఇవ్వాలంటూ కోరుతున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో గ్రామ సచివాలయాలు 938, వార్డు సచివాలయాలు 227 ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 20,482 మంది వలంటీర్లు పనిచేస్తున్నారు.
తొలగించిన వీఓఏ,
ఆర్పీల్ని విధుల్లోకి తీసుకోవాలి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీఓఏలు, ఆర్పీల పట్ల రాజకీయ వేధింపులు ఎక్కువైపోయాయి. తమకు నచ్చిన వారిని పెట్టుకుంటాం రాజీనామా చేయండి అంటూ స్థానిక కూటమి నేతు హుకుం జారీ చేస్తున్నారు. అక్రమంగా విధుల్లోంచి తొలగించిన వీఓఏలు, ఆర్పీలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఏపీ వెలుగు వీవోఏ(యానిమేటర్స్) ఉద్యోగులు ఇటీవల కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహించారు. ఏలూరు జిల్లాలో 100 మంది వరకు వీఓఏలు, 20 మంది ఆర్పీలు విధులకు దూరమయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో 50 మందికి పైగా వీఓఏలు, 10 మంది వరకు ఆర్పీలు విధులకు దూరమయ్యారు.
రోడ్డెక్కిన హమాలీలు
పౌరసరఫరాల శాఖ పరిధిలోని గోడౌన్స్‌లో పనిచేస్తున్న హమాలీలు తమ వేతనాలు పెంచాలని కోరుతూ రోడ్డెక్కారు. వీరికి ప్రతి రెండేళ్లకు ఒకసారి వేతన ఒప్పందాలు జరుగుతాయి. అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం వేతనాల పెంపును పట్టించుకోలేదు. ఏలూరు జిల్లా పరిధిలోని ఏలూరు, కై కలూరు, పాతూరు, నూజివీడు, ధర్మాజీగూడెం, కుకునూరు, కేఆర్ పురం, జంగారెడ్డిగూడెం, పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని స్టాక్ పాయింట్ల వద్ద హమాలీలు ఇటీవల నిరసన వ్యక్తం చేశారు.
ఏలూరు (టూటౌన్): కూటమి ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తోందని వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు విమర్శించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పాత బస్టాండ్ సెంటర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి మంగళవారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఆటవిక పాలన సాగిస్తోందన్నారు. వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెరిగిపోయాయన్నారు. సంక్షేమం, అభివృద్ధి, చిరు ఉద్యోగుల సమస్యలు కనీసం పట్టించుకోవడం లేదన్నారు. కూటమి ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు. అంబేడ్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. గత వైఎస్సార్‌సీపీ పాలనలో అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిందన్నారు. ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ మామిళ్లపల్లి జయప్రకాష్(జేపీ) మాట్లాడుతూ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడంతో పాటు గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపైనా ఉందన్నారు. అంబేడ్కర్ ఆశయ సాధన దిశగా పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ డిఫ్యూటీ మేయర్ నూకపెయ్యి సుధీర్ బాబు, మాజీ కో–ఆప్షన్ సభ్యులు మున్నుల జాన్ గురునాథ్ తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు (టూటౌన్): మోదీ ప్రభుత్వ రైతు, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సంయుక్త కిసాన్ మోర్చా– కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక పిలుపులో భాగంగా రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, గిరిజనులు ఏలూరు కలెక్టరేట్ ముందు కదం తొక్కారు. ఫైర్ స్టేషన్ సెంటర్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. డప్పులు మోగిస్తూ నృత్యాలతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టరేట్ ముందు మహా ధర్నా చేపట్టారు. 75 వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. సభకు సీఐటీయు జిల్లా అధ్యక్షుడు ఆర్.లింగరాజు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పి.సోమశేఖర్ అధ్యక్షత వహించారు. సభలో ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చలసాని వెంకట రామారావు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి డీఎన్‌వీడి ప్రసాద్, ఐఎఫ్‌టీయు రాష్ట్ర నాయకులు ఎస్.రామ్మోహన్, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్, బీకేఎంయు జిల్లా అధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు, రైతు కూలీ సంఘం (ఆంధ్రప్రదేశ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.కె.బాషా, అఖిల భారత ప్రగతిశీల రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎస్.కె.గౌస్, ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు పోరండ్ల శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ తదితరులు కేంద్ర ప్రభుత్వ విధానాల్ని విమర్శించారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర లేకపోవడం దుర్మార్గమన్నారు. కార్పొరేట్ కంపెనీలకు రూ.లక్షల కోట్లు మాఫీ చేస్తూ ఆత్మహత్యలు చేసుకుంటున్న అన్నదాతలకు పైసా కూడా మాఫీ చేయలేదని విమర్శించారు. కార్మికుల హక్కులను కాలరాసే లేబర్ కోడ్‌లు రద్దు చేయాలన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని కోరారు. పోరాటాల ద్వారా సాధించుకున్న ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రాజనాల రామ్మోహన రావు, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.కృష్ణ చైతన్య, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ధర్మల సురేష్, సీపీఐ (ఎంఎల్) రెడ్ స్టార్ జిల్లా కార్యదర్శి జొన్నకూటి వెంకటేశ్వరరావు రైతులు కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటించారు.
10 లోపు రేషన్ సరఫరా
ఏలూరు(మెట్రో): జిల్లాలో ప్రజా పంపిణీకి సంబంధించి ప్రతి నెలా 10 లోపు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని ఎండీయు ఆపరేటర్లను జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి ఆదేశించారు. పీడీస్ బియ్యంతో పాటుగా తప్పనిసరిగా కందిపప్పు, పంచదార పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జిల్లాలోని పౌర సరఫరాల డిప్యుటీ తహసీల్దార్లు, చౌకధరల దుకాణాల డీలర్లు, ఎండీయూ ఆపరేటర్లు, ఎంఎల్‌ఎస్ పాయింట్ ఇన్‌చార్జిలు, ఎల్‌పీజీ గ్యాస్ డీలర్లు, సేల్స్ ఆఫీసర్లు, జిల్లా పౌరసరఫరాల కార్యాలయ సిబ్బందితో సమన్వయ సమావేశం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ చౌక ధరల దుకాణాల డీలర్లు, పీడీఎస్‌కు సంబంధించి నిత్యావసర వస్తువుల విషయమై డీడీలు సకాలంలో కట్టాలని ఆదేశించారు.
ఏలూరు(మెట్రో): ఎన్నికల సక్రమ నిర్వహణకు శిక్షణా కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు చెప్పారు. కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశపు హాలులో మంగళవారం ఉమ్మడి పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఓ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు బ్యాలెట్ విధానంలో జరుగుతాయన్నారు. సిబ్బందికి ఏమైనా సందేహాలుంటే వెంటనే శిక్షకుల దృష్టికి తీసుకువస్తే వెంటనే నివృత్తి చేస్తారన్నారు.
ఎన్నికల నిర్వహణపై శిక్షణ
సంకల్పంతో కూడిన ఆత్మస్థైర్యం ఉంటే చాలు ఏ వైకల్యం మనకు అడ్డురాదని నిరూపించారు విభిన్న ప్రతిభావంతులు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్బంగా మంగళవారం ఏలూరు ఏఎస్‌ఆర్ స్టేడియంలో దివ్యాంగులకు ఆటల పోటీలు నిర్వహించారు. పెద్ద ఎత్తున దివ్యాంగులు హాజరై తమ ప్రతిభను చూపారు. ట్రై సైకిల్, జావెలిన్ త్రో, షార్ట్‌ఫుట్, పరుగు పందెంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. గెలవాలనే కాంక్షతో పరుగులు పెట్టారు.
–సాక్షి ఫొటోగ్రాఫర్/ఏలూరు, ఏలూరు(టూటౌన్)
గెలవాలనే కసితో..
జావెలిన్ త్రో
అంధుల పరుగు పోటీల్లో పరుగులు తీస్తూ
న్యూస్‌రీల్
జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి
ఆందోళనలతో దద్దరిల్లుతున్న కలెక్టరేట్లు
రోడ్డెక్కిన చిరుద్యోగులు
ఆందోళన బాటలో ఆశ, 108, హమాలీ, అంగన్‌వాడీ, వీఓఏలు
ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలోని 276 మినీ అంగన్‌వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చుతూ తక్షణం జీవోలు ఇవ్వాలంటూ మినీ అంగన్‌వాడీ వర్కర్‌లు ఆందోళన చేస్తున్నారు. కేవలం రూ.7 వేలు వేతనం ఇస్తున్నారని ఇది అత్యంత దుర్మార్గమంటూ వారు విమర్శిస్తున్నారు. మెయిన్ సెంటర్‌లో పనిచేస్తే కార్యకర్తకు ఇస్తున్న విధంగా తమకూ వేతనం ఇవ్వాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో 206, పశ్చిమగోదావరి జిల్లాలో 70 మంది కలిపి రెండు జిల్లాల్లో మొత్తం 276 మంది మినీ అంగన్‌వాడీ వర్కర్లు పనిచేస్తున్నారు.
2024 ఫిబ్రవరిలో చేసుకున్న ఒప్పందాలు అమలు చేయాలంటూ ఆశ వర్కర్లు ఆందోళన చేశారు. ఆశ వర్కర్ల వయో పరిమితి 62 ఏళ్లకు పెంచాలని, గ్రూప్ బీమా ఆరు లక్షలు, రిటర్మెంట్ బెనిఫిట్ రూ.60 వేలు ఇస్తామంటూ ఒప్పందం చేసుకున్నారని దీనికి సంబంధించి తక్షణం జీవోలు విడుదల చేయాలంటూ వీరు ధర్నా నిర్వహిస్తున్నారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలో మొత్తం 3,800 మంది వరకు ఆశలు పనిచేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ఇప్పటికే ఏలూరు, భీమవరం కలెక్టరేట్ల ముందు ధర్నాలు నిర్వహించారు .
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 108 ఉద్యోగులు సోమవారం అర్థరాత్రి నుంచి సమ్మె బాట పట్టారు. 108 అంబులెన్స్ సర్వీసులు నేరుగా ప్రభుత్వమే నిర్వహించాలని, షిప్టుల సిస్టం అమలు చేయాలని, రెండు నెలల వేతన బకాయిలు తక్షణం చెల్లించాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో 108 వాహనాలు 28 ఉండగా వీటిలో మొత్తం 140 మంది పైలట్‌లు, ఈఎంటీలు పనిచేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో 108 వాహనాలు 23 ఉండగా వీటి పరిధిలో 110 మంది సిబ్బంది పనిచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment