అక్రమ అరెస్టులను అడ్డుకుంటాం
ఏలూరు టౌన్: కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయని, వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టడం దుర్మార్గమని ఏలూరు జిల్లా వైస్సార్‌సీపీ లీగల్ సెల్ నాయకులు అన్నారు. బుధవారం విజయవాడలో వైస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఏలూరు న్యాయవాది ప్రత్తిపాటి తంబి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా కార్యకర్తలను వేధిస్తున్నారని, కేసుల పేరుతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా ఉంటూ భరోసా ఇవ్వాలని కోరారు. పార్టీ కార్యకర్తలు సైతం అనవసర విమర్శలు చేయకుండా ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరారు. ఏలూరు జిల్లా కామవరపుకోట ప్రాంతానికి చెందిన న్యాయవాది కే కిరణ్ కుమార్ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వంగా కలిశారు. సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో న్యాయవాదులు కొండ యశ్వంత్, ప్రత్తిపాటి విజయ్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment