ముందస్తు నిర్ధారణతో క్యానర్స్‌కు కళ్లెం | - | Sakshi
Sakshi News home page

ముందస్తు నిర్ధారణతో క్యానర్స్‌కు కళ్లెం

Published Thu, Nov 28 2024 1:10 AM | Last Updated on Thu, Nov 28 2024 1:10 AM

ముందస

ముందస్తు నిర్ధారణతో క్యానర్స్‌కు కళ్లెం

బుట్టాయగూడెం: క్యాన్సర్‌ మహమ్మారి ప్రస్తుతం చాప కింద నీరులా విస్తరిస్తుంది. జాతీయ కుటుంబ ఆరోగ్యశాఖ సర్వే ప్రకారం క్యాన్సర్‌ను ఆలస్యంగా గుర్తించడం వల్ల అధిక మరణాలు సంభవిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ మహమ్మారిని ఎదుర్కొనాలంటే ముందస్తుగా క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలు చేయిస్తే ప్రాథమిక దశలోనే తగ్గించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళల్లో పలు రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశలు ఉన్నాయని వారికి పూర్తి అవగాహన కల్గించి పరీక్షలు నిర్వహించాలని డాక్టర్లు చెబుతున్నారు. ఇటీవల కేసులు ఎక్కువగా నమోదవుతుండడంలో ఈ మహమ్మారిని అరికట్టేందుకు వైద్య అరోగ్య శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. దీనిలో భాగంగా ఎన్‌సీడి 3.0 అనే కార్యక్రమం అమలుకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రతి ఇంటికీ తిరిగి క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.

జిల్లాలోని 80 ప్రభుత్వ ఆస్పత్రుల

పరిధిలో సర్వే

క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షల సమాచారాన్ని నిక్షిప్తం చేయడానికి వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. యాప్‌లో సమాచారాన్ని నమోదు చేసే విధానంపై ఆరోగ్యశాఖ సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చారు. జిల్లాలోని 80 ప్రభుత్వ ఆస్పత్రుల పరిధిలో ఆరోగ్యశాఖ సిబ్బంది ఇంటింటికీ తిరిగి 18 ఏళ్లు నిండిన వారికి పలురకాల ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రల్లోనూ విద్యార్థులకు పరీక్షలు చేస్తున్నట్లు వైద్యులు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 16,72,579 మందికి ఈ పరీక్షలు చేయనున్నట్లు వైద్యులు తెలిపారు.

ఇంటింటి సర్వే విధానం ఇలా..

ప్రతీ ఇంటికి తిరిగి ఆరోగ్య సిబ్బంది 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి ఆరోగ్య సమస్యలను తెలుసుకుని ఆ సమాచారాన్ని యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. దంత సమస్యలు నమోదు చేయడంలో క్యాన్సర్‌ను ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఏమైనా అనుమానాలు తలెత్తితే అనుమానితులను సమీపంలోని ఆస్పత్రి వైద్యుల వద్దకు రిఫర్‌ చేస్తున్నారు.

స్క్రీనింగ్‌ పరీక్షలతోనే కనుగొనే ప్రయత్నం

ఒక వ్యక్తిలో క్యాన్సర్‌ కణాల కోసం శోధించడాన్నే స్క్రీనింగ్‌ అని పిలుస్తారు. ఆ వ్యక్తిలో ప్రభావిత లక్షణాలు ఉన్నాయో లేదో అని పరిశీలిస్తారు. ముందస్తు రోగ నిర్ధారణ పరీక్ష చేశారు. మహిళల్లో గర్భాశయ, రొమ్ము, నోటి క్యాన్సర్‌ లక్షణాలను సైతం గుర్తించేలా సర్వే చేస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులపై కూడా ఆరా తీస్తున్నారు. ఈ సర్వేలో జిల్లాలో ఇంత వరకూ 1681 మంది క్యాన్సర్‌ పేషెంట్లు ఉన్నట్లు గుర్తించాలి. వీరిలో 1264 మంది సీ్త్రలు, 417 మంది పురుషులు ఉన్నారు. ఈ సర్వే సుమారు 9 నెలల పాటు కొనసాగుతుంది

గిరిజన ప్రాంతంలో జల్లెడ పడుతున్న సిబ్బంది

గిరిజన ప్రాంతంలోని ఉన్న 15 ప్రభుత్వ ఆసుపత్రుల పరిధిలో ఆరోగ్యశాఖ సిబ్బందిపై ముమ్మరంగా సర్వే చేస్తున్నారు. ఇంటింటికీ తిరిగి పరీక్షలు చేస్తున్నారు. ప్రతి గ్రామంలో జల్లెడ పట్టి 18 సంవత్సరాలు నిండిన వారితో పాటు పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలో కూడా పరీక్షలు చేస్తున్నారు.

అన్ని గ్రామాల్లో క్యాన్సర్‌

గుర్తింపునకు ఇంటింట సర్వే

18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ స్క్రీనింగ్‌ పరీక్షలు

జిల్లాలో 16,72,579 మందికి పరీక్షలు

ఇంతవరకు 1,681 మంది పేషెంట్ల గుర్తింపు

సిబ్బందికి శిక్షణ ఇచ్చాం

పరీక్షలకు సంబంధించి సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. పరీక్షల సమాచారాన్ని యాప్‌లో నమోదు చేస్తున్నారు. సర్వేను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

– డాక్టర్‌ జె.సురేష్‌, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, కేఆర్‌పురం

సర్వేకు అందరూ సహకరించాలి

క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలకు సంబంధించి చేస్తున్న సర్వేకు అందురూ సహకరించాలి. సర్వేపై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు. మహిళలు ఎక్కువగా గర్భాశయ, రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఈ పరీక్షలతో సత్ఫలితాలు పొందవచ్చు.

– డాక్టర్‌ శర్మిష్ట, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి, ఏలూరు

No comments yet. Be the first to comment!
Add a comment
ముందస్తు నిర్ధారణతో క్యానర్స్‌కు కళ్లెం 1
1/2

ముందస్తు నిర్ధారణతో క్యానర్స్‌కు కళ్లెం

ముందస్తు నిర్ధారణతో క్యానర్స్‌కు కళ్లెం 2
2/2

ముందస్తు నిర్ధారణతో క్యానర్స్‌కు కళ్లెం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement