పెనుగొండ: పెనుగొండ ఎస్వీకేపీ కళాశాలలో బుధవారం అంతర్జాతీయ తెలుగు సదస్సు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వైవీ అప్పారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పలు అంశాలపై చర్చించారు. కళాశాల మాజీ తెలుగు విభాగాధిపతి డాక్టర్ రామ్మోహన్‌రావు సదస్సు ప్రాధాన్యతను వివరించారు. అనంతరం రాజమండ్రి మానస హాస్పిటల్ అధినేత డాక్టర్ కర్రి రామారెడ్డి యోగా ప్రాముఖ్యతను వివరించారు. కళాశాల అధ్యక్షుడు తాడి నాగిరెడ్డి, నన్నయ యూనివర్సిటీ తెలుగు విభాగాధిపతి వరప్రసాద్, వాసిలి వసంతరావు తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా పరిశోధన పత్రాలు సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment