బాలికా సంరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలి
ఏలూరు(మెట్రో): జిల్లా స్థాయి నుంచి మండల, గ్రామ స్ధాయి వరకు బాలికా సంరక్షణపై పటిష్ట చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు. బుధవారం కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కిశోరీ వికాసం–2.0 జిల్లా స్థాయి శిక్షకుల శిక్షణా కార్యక్రమం ఐసీడీఎస్ పీడీ కె.పద్మవతి అధ్యక్షతన జరిగింది. బాల్యవివాహాలకు వ్యతిరేకంగా సంబంధిత శాఖల అధికారులు, శిక్షణా కార్యక్రమానికి హాజరైన సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. తదుపరి కిశోరీ వికాసం–2.0 సంపూర్ణ సాధికారిత కోసం జిల్లాకు సంబంధించిన గోడ పత్రికను కలెక్టర్ విడుదల చేశారు. గ్రామాల్లో అంగన్‌వాడీ వర్కర్లు, సూపర్‌వైజర్లు, పాఠశాల ఉపాధ్యాయులు బాల్యవివాహాల జరిగే సమాచారాన్ని సంబంధిత అధికారులకు, టోల్ ప్రీ నెం1098 కు చేరవేయాలని చెప్పారు. ఏలూరు జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చడానికి సంబంధిత అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ సూర్యచంద్రరావు, ఆంధ్రప్రదేశ్ బాలహక్కుల కమిషన్ సభ్యుడు రాజేంద్రప్రసాద్, డీఈఓ వెంకటలక్ష్మమ్మ, డీఆర్‌డీఏ పీడీ ఆర్.విజయరాజు, డీఎంహెచ్‌ఓ ఇన్‌చార్జి డా.జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment