● రాజ్యాంగం పట్ల విధేయత
రాజ్యాంగ అవతరణ దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఘనంగా నిర్వహించారు. దేశ పురోగతి, ప్రజల సంక్షేమాలకు తోడ్పాటునందించే భారత రాజ్యాంగానికి ఆమోదం లభించి 75 వసంతాలు పూర్తిచేసుకుంది. ఈనేపథ్యంలో రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేడ్కర్‌కు ఘన నివాళి అర్పించారు. రాజ్యాంగ పీఠికను పాఠశాలల్లో విద్యార్థులతో చదివించారు. బయ్యనగూడెంలో సరిపల్లి రోడ్లో ఉన్న ఎంపీయూపీ పాఠశాలలో విద్యార్థులు భారతదేశ చిత్రపటం ఆకారంలో ప్రదర్శన నిర్వహించి రాజ్యాంగం పట్ల తమ విధేయతను చాటుకున్నారు.
– కొయ్యలగూడెం
Comments
Please login to add a commentAdd a comment