నేషనల్ హార్టీకల్చర్ డిప్యూటీ డైరెక్టర్‌గా నిస్సీఫ్లోర
ఉండి: నేషనల్ హార్టీకల్చర్ డిప్యూటీ డైరెక్టర్‌గా ఉండి పెదపేటకు చెందిన గోడి నిస్సీఫ్లోరా నియమితులయ్యారు. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లో డిసెంబర్ 2న ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న 16 డైరెక్టర్ పోస్టులకుగాను 16 వేల మంది ప్రిలిమ్స్ పరీక్ష రాశారు. అందులో 251 మంది మెయిన్స్‌కు ఎంపిక కాగా 65 మంది ఇంటర్వ్యూకు పోటీ పడ్డారు. ఈ పరీక్షల్లో నిస్సీఫ్లోరా ప్రతిభ కనబరిచి డైరెక్టర్ పోస్టుకు అర్హత సంపాదించారు. మంగళవారం ఆమె తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్‌టీఏ ఆధ్వర్యంలో నేషనల్ హార్టీ కల్చర్ బోర్డు 2023 డిసెంబర్‌లో నోటిఫికేషన్ ఇవ్వడంతో 2024 జనవరిలో దరఖాస్తు చేసినట్లు తెలిపారు. అనంతరం ఫిబ్రవరిలో ప్రిలిమ్స్, మార్చిలో మెయిన్స్ పరీక్షలు రాశానని, ఏప్రిల్‌లో ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిందన్నారు. అక్టోబర్‌లో ఫైనల్ రిజల్ట్ వెలువడగా ఈనెల 18వ తేదీన అపాయింట్‌మెంట్ ఆర్డర్ వచ్చినట్లు ఆమె తెలిపారు.
గల్ఫ్ పంపిస్తానని మోసం.. కేసు నమోదు
భీమవరం: ప్లంబింగ్ పనికి గల్ఫ్ పంపిస్తానని చెప్పి సొమ్ము తీసుకుని మలేషియా పంపించి మోసం చేశారంటూ భీమవరం పట్టణం మోటుపల్లివారివీధికి చెందిన కోడె నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వన్‌టౌన్ ఎస్సై బీవై కిరణ్‌కుమార్ తెలిపిన వివరాలివి. నాగరాజు ఉపాధికోసం గల్ఫ్ వెళ్లే ప్రయత్నంలో ఉండగా ప్రకాష్‌నగర్‌కు చెందిన రేవు రామలక్ష్మి ప్లంబింగ్ పనులకు గల్ఫ్ పంపిస్తానని నమ్మించి రూ.1.50 లక్షలు తీసుకుంది. అయితే నాగరాజును మలేషియా పంపించి హోటల్ పనిలో పెట్టడంతో అక్కడ జీతం ఇవ్వకుండా మానసికంగా వేధించారు. దీనితో నాగరాజు భార్య రామలక్ష్మిని కలిసి తన భర్తను తిరిగి రప్పించాలని కోరినా పట్టించుకోలేదు. దీంతో సొంత డబ్బులతో తిరిగి వచ్చిన నాగరాజు రామలక్ష్మిని నిలదీయగా నీ అంతచూస్తానని బెదిరించారు. బాధితుడు నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై కిరణ్‌కుమార్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment