తాడేపల్లిగూడెం: ఆలయాలపై ప్రభుత్వ పెత్తనం తగదని భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతీస్వామీజీ అన్నారు. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎస్‌వీఆర్ సర్కిల్ వద్ద బుధవారం ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడారు. దేవాదాయశాఖను ప్రభుత్వం రద్దు చేయాలన్నారు. ప్రభుత్వం దేవాలయాల బాధ్యత నుంచి తప్పుకుంటే వాటిని నిర్వహించేందుకు మంచి వ్యక్తులు కావాలన్నారు. దేవాదాయశాఖలో నీతిని మరిచిన వారున్నారని, అలాంటి వ్యక్తులు హిందూ ధర్మాన్ని, ఆలయాలను ఎలా పరిరక్షిస్తారన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ అందరి బాధ్యత అని అన్నారు. దేవుడికి ప్రాణ ప్రతిష్ట చేసే ఆగమ శాస్త్రం హిందూ ధర్మంలో ఉందన్నారు. సమాజంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. జనవరి 5న విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆలయాల పరిరక్షణ కోసం నిర్వహించే హైందవ శంఖారావం కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తరలి రావాలన్నారు. వీహెచ్‌పీ నియోజకవర్గ కన్వీనర్ భోగిరెడ్డి ఆదిలక్ష్మి, రాష్ట్ర నాయకురాలు పద్మావతి ప్రాంత ప్రచారక్ సుంకవల్లి రామకృష్ణ, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ తదితరులు పాల్గొన్నారు.
కమలానంద భారతీ స్వామీజీ
Comments
Please login to add a commentAdd a comment