10 రోజులు.. 210 బస్సులు
భీమవరం (ప్రకాశంచౌక్): సంక్రాంతి పండగకు హైదరాబాద్ నుంచి సొంత ఊర్లకు వచ్చే వారి కోసం పశ్చిమ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తుంది. సంక్రాంతి పండగకు హైదరాబాద్ నుంచి జిల్లాకు వచ్చే వారి కోసం జనవరి 9 నుంచి 12 వరకు రోజుకు 30 బస్సులు చొప్పన నాలుగు రోజులు పాటు 120 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నుంచి జవనరి 9 మొదలు 12వ తేదీ వరకు ప్రతి రోజు రాత్రి ప్రత్యేక బస్సులు బయలురేరి జిల్లాలోని భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, నర్సాపురం డిపోల పరిధిలోని బస్టాండ్లకు సర్వీసు చేస్తాయి. ఎక్స్‌ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపరీ లగ్జరీ, ఇంద్ర బస్సులను సంక్రాంతి ప్రత్యేక బస్సులుగా నడపనున్నారు. అలాగే పండగ అనంతరం తిరుగు ప్రయాణానికి 15వ తేదీ నుంచి 20వ తేది వరకూ రోజుకు 15 ప్రత్యేక బస్సులు జిల్లాలోని నాలుగు డిపోల పరిధిలో ఆయా బస్టాండ్లు నుంచి హైదరాబాద్‌కు నడపనున్నారు.
సాధారణ టికెట్ ధరకే ప్రయాణం
సంక్రాంతి పండగకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి సాధారణ టికెట్ ధరలకే సర్వీసు చేయాలని నిర్ణయించింది. అలాగే ఆన్‌లైన్ బుకింగ్‌పై 10 శాతం రాయితీ కల్పిస్తుంది. ఇప్పటికే ఆన్‌లైన్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఈ ఏడాది జనవరిలో 208 ప్రత్యేక సర్వీసుల ద్వారా రూ.60 లక్షల ఆదాయం ఆర్టీసీకి సమకూరింది. మూడేళ్లుగా సంక్రాంతికి ఆదాయం పెరుగుతూనే ఉంది. అలాగే ఈ ఏడాది కార్తీక మాసంలో 194 ప్రత్యేక బస్సుల ద్వారా రూ.56 లక్షల ఆదాయం సమకూరింది.
సంక్రాంతికి ‘పశ్చిమ’ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు
హైదరాబాద్‌కు రాకపోకల కోసం స్పెషల్ బస్సులు
ఆన్‌లైన్ బుకింగ్‌లో 10 శాతం రాయితీ
హైదరాబాద్‌కు టికెట్ చార్జీలు ఇంద్ర రూ.930
సూపర్ లగ్జరీ రూ.730
ఎక్స్‌ప్రెస్ రూ.710
అల్ట్రా డీలక్స్ రూ.720
సంక్రాంతి ఆదాయం
సంవత్సరం ఆదాయం
2024 రూ.60.00 లక్షలు
2023 రూ.54.62 లక్షలు
2022 రూ.36.88 లక్షలు
ప్రత్యేక బస్సులను వినియోగించుకోవాలి
హైదరాబాద్‌కు రాకపోకలు సాగించేవారు సంక్రాంతి ప్రత్యేక సర్వీసులను వినియోగించుకోవాలి. పండుగ ముందు, తర్వాత ఇవి నడుస్తాయి. జనవరి 9 తేదీ నుంచి 20వ తేదీ వరకు మధ్యలో రెండు రోజులు మినహాయించి 10 రోజుల పాటు ప్రత్యేక బస్సులు నడుస్తాయి. ఆన్‌లైన్ రిజర్వేషన్లు ద్వారా టికెట్ ధరలో 10 శాతం రాయితీ అందిస్తున్నాం.
– ఎన్‌వీఆర్ వరప్రసాద్, జిల్లా ప్రజా రవాణా అధికారి
Comments
Please login to add a commentAdd a comment