సారా బట్టీలపై మెరుపు దాడులు
ముసునూరు : ఏలూరు ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రొహిబిషన్ ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ వైవీఎన్‌ఎస్ ఫణి కుమార్ ఆధ్వర్యంలో బుధవారం సారాబట్టీపై మెరుపు దాడులు నిర్వహించారు. గుళ్ళపూడిలో తమ్మిలేరు ఒడ్డున నిర్వహిస్తున్న సారా బట్టీపై దాడి నిర్వహించి 400 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి, 10 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నట్లు నూజివీడు ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ మస్తానయ్య తెలిపారు. బట్టీ యజమాని బోట్ల శేఖర్‌పై కేసు నమోదు చేశామన్నారు. ఈ దాడుల్లో సబ్ ఇన్‌స్పెక్టర్లు ఆరిఫ్, ఈశ్వరరావు, ఎం.ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.
పోలవరం రూరల్: పోలవరం మండలంలోని జిళ్లేళ్లగూడెం సమీపంలో పంట కాలువ ప్రదేశాల్లో పోలవరం ప్రొహిబిషన్ అండ్‌ఎకై ్సజ్ అధికారులు సారా బట్టీలపై దాడులు నిర్వహించారు. నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లపు ఊట కలిగిన మూడు డ్రమ్ములను గుర్తించి 600 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్లు ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ కె.వీరబ్రహ్మం తెలిపారు. దాడుల్లో సబ్ ఇన్‌స్పెక్టర్ ఎల్.శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment