ఏలూరు (టూటౌన్): ఏలూరు జిల్లా కో ర్టులో పనిచేస్తున్న పలువురు పరిపాలనా అధికారులను బదిలీ చేశారు. ఏలూరు ఫ్యామిలీ కోర్టు కమ్ 7వ అడిషనల్ జిల్లా అండ్ సెషన్స్ కోర్టు నందు చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా పనిచేస్తున్న జి.అమరనాఽథ్‌ను విజయవాడ బదిలీ చేశారు. ఆయన స్థానంలో గుంటూరులో పనిచేస్తున్న డి. యాగన నారాయణశాస్త్రిని నియమించారు. ఏలూరు ప్రధాన న్యాయమూర్తి కోర్టులో సీనియర్ సూపరింటెండెంట్ ఎస్.గీతను కాకినాడకు బదిలీ చేశారు. ఇదే కోర్టులో స్టెనోగ్రాఫర్ బి.సోలోమన్ రాజును మచిలీపట్నం బదిలీ చేశారు.రాజమండ్రిలో చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా పనిచేస్తున్న పి.సీతారామరాజును భీమవరం పోక్సో కోర్టులో నియమించారు. కాకినాడ పీడీజే కోర్టులో సీనియర్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న పి.స్వర్ణదేవిని తాడేపల్లిగూడెంలోని 5వ అడిషనల్ జిల్లా అండ్ సెషన్స్ కోర్టు చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా నియమించారు. మచిలీపట్నం పీడీజే కోర్టులో సీనియర్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న వై.రామప్రసాద్‌ను ఏలూరు ప్రత్యేక సెషన్స్ కోర్టు చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment