ఆపదలో ఆడబిడ్డ ! | - | Sakshi
Sakshi News home page

ఆపదలో ఆడబిడ్డ !

Published Thu, Jan 23 2025 1:38 AM | Last Updated on Thu, Jan 23 2025 1:37 AM

ఆపదలో

ఆపదలో ఆడబిడ్డ !

గురువారం శ్రీ 23 శ్రీ జనవరి శ్రీ 2025

సాక్షి, భీమవరం: అమ్మగా.. అక్కగా.. చెల్లిగా.. అర్ధాంగిగా.. అనేక పాత్రల్లో చెయ్యి పట్టి నడిపించే ఆడ బిడ్డకు ఆపదొచ్చింది. ఆడపిల్ల భారమనుకునే రోజుల నుంచి ఆడ బిడ్డ కోసం ఎదురుచూసే రోజులు వచ్చినా కొన్ని మండలాల్లో పురుషులు, మహిళల లింగ నిష్పత్తి వ్యత్యాసం ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. జిల్లా యంత్రాంగం అప్రమత్తమై అవగాహన కార్యక్రమాల నిర్వహణకు చర్యలు చేపట్టింది. ఆడ, మగ శిశువు జననాల సంఖ్యను బట్టి వెయ్యి మంది మగవారికి ఎంత మంది మహిళలు ఉన్నారో లింగ నిష్పత్తిని లెక్కగడుతుంటారు. సాధారణంగా పునరుత్పత్తి చేసే జాతుల్లో చాలా వరకు ఆడ మగ మధ్య లింగనిష్పత్తి 1:1 గా ఉంటుంది. 2011 జనాభా మేరకు రాష్ట్ర లింగ నిష్పత్తి 1000 మంది మగవారికి 992 మంది మహిళలు ఉన్నారు. లింగ నిర్ధారణ పరీక్షల ద్వారా ఆబార్షన్లు చేయించుకోవడం, భ్రూణ హత్యలు, శిశు మరణాలు, ఆహార పంటల్లో రసాయనాల ప్రభావం, ఒక్కోసారి ఆడ లేదా మగ శిశువులు ఎక్కువగా జన్మించడం, తదితర కారణాలతో లింగ నిష్పత్తిలో వ్యత్యాసాలు చోటుచేసుకుంటాయని నిపుణులు అంటున్నారు.

ఆ మండలాలపై ప్రత్యేక దృష్టి

లింగ నిష్పత్తి వ్యత్యాసం ఎక్కువగా ఉన్న ఆయా మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉన్నతస్థాయి నుంచి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలందాయి. ఈ మేరకు లింగ నిష్పత్తిలో పురుషుల కంటే మహిళల సంఖ్య తక్కువగా ఉన్న కాళ్ల, పెనుమంట్ర తదితర మండలాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆయా చోట్ల ఆడ శిశువుల సంఖ్య తగ్గడానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. లింగస్థ నిర్ధారణ పరీక్షల ద్వారా ఆడశిశువులను మొగ్గలోనే తుంచేసేలా అబార్షన్లు చేయించడం, భ్రూణ హత్యలపైనా ఆరా తీస్తున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు జరుగకుండా నిఘాను మరింత పెంచేలా పోలీసులతో కలిసి జిల్లా వ్యాప్తంగా ఉన్న 155 స్కానింగ్‌ సెంటర్లపై తనిఖీలు, డెకాయ్‌ ఆపరేషన్లు మరింత విస్తృతం చేయాలని నిర్ణయించారు. సీ్త్రల నిష్పత్తిని పెంచే విధంగా సీ్త్ర శిశు సంక్షేమ శాఖతో కలిసి ఆడ బిడ్డల ఆవశ్యకతను వివరిస్తూ భేటి బచావో.. భేటీ పడావో తదితర అవగాహన కార్యక్రమాల నిర్వహణకు చర్యలు చేపట్టారు.

న్యూస్‌రీల్‌

1000

942

మండలం జననాలు మగ ఆడ 1000

మందికి ఆడవారు

ఆచంట 696 352 344 977

ఆకివీడు 661 333 327 982

అత్తిలి 563 288 275 955

భీమవరం 1,878 986 893 906

గణపవరం 591 307 284 925

ఇరగవరం 685 358 327 913

కాళ్ల 655 363 292 804

మొగల్తూరు 531 277 254 917

నర్సాపురం 1,463 765 698 912

పాలకోడేరు 403 214 189 883

పాలకొల్లు 1,017 495 521 1053

పెంటపాడు 640 300 340 1,133

పెనుగొండ 380 199 181 910

పెనుమంట్ర 872 475 397 836

పోడూరు 486 259 227 876

తాడేపల్లిగూడెం 1647 882 765 867

తణుకు 1,348 719 627 872

ఉండి 607 300 307 1,023

వీరవాసరం 657 351 306 872

యలమంచిలి 1,082 564 518 918

జిల్లాలో ఆందోళనకర స్థాయిలో

లింగ నిష్పత్తి వ్యత్యాసం

2011 లెక్కల ప్రకారం 1000 మంది పురుషులకు 942 సీ్త్రలు

తొమ్మిది నెలల్లో పలుచోట్ల వ్యత్యాసం ఎక్కువగా ఉన్నట్టు గుర్తింపు

కాళ్ల, పెనుమంట్ర మండలాల్లో 1000 మంది మగవారికి 830 లోపే..

51 మంది శిశువులు పురిటిలోనే మరణం

అప్రమత్తమైన అధికారులు

900 కంటే తక్కువగా..

2024 ఏప్రిల్‌ నుంచి డిసెంబరు నెలాఖరు వరకు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులు, ఇంటి వద్ద జరిగిన డెలివరీల ఆధారంగా ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ లింగ నిష్పత్తిని బేరీజు వేసింది. దీనికి సంబంధించిన చైల్డ్‌ సర్వైవల్‌ అండ్‌ సేఫ్‌ మదర్‌హుడ్‌ (సీఎస్‌ఎస్‌ఎం) గణాంకాల్లో ఆశ్చర్యకర విషయాలు వెలుగుచూశాయి. జిల్లాలో 16,859 మంది జన్మించగా వీరిలో మగ శిశువులు 8,787 మంది, ఆడ శిశువులు 8,072 మంది ఉన్నారు. పాలకొల్లు, పెంటపాడు, ఉండి మండలాల్లో మగ శిశువుల కంటే ఆడ శిశువుల జననాలు ఎక్కువగా ఉంటే ఏడు మండలాల్లో చాలా తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. వెయ్యి మంది మగవారిలో ఆడ శిశువులు 800 నుంచి 900 లోపు ఉన్నారు. కాళ్ల మండలంలో 804 మంది, పెనుమంట్రలో 836, తాడేపల్లిగూడెంలో 867, తణుకు, వీరవాసరంలలో 872, పోడూరులో 876, పాలకోడేరులో 883 మంది ఉన్నారు.

విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు

లింగ నిష్పత్తి వ్యత్యాసం ఎక్కువగా ఉన్న మండలాల్లో సీ్త్రల నిష్పత్తిని పెంచేందుకు ప్రత్యేక దృష్టిసారించాం. సమాజంలో ఆడ పిల్లల ఆవశ్యకతను వివరిస్తూ సీ్త్రశిశు సంక్షేమ శాఖ భాగస్వామ్యంతో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. స్కానింగ్‌ సెంటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కడైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేసే స్కానింగ్‌ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. – బి.భానునాయక్‌, జిల్లా ఇన్‌చార్జి వైద్య ఆరోగ్యశాఖ అధికారి

No comments yet. Be the first to comment!
Add a comment
ఆపదలో ఆడబిడ్డ ! 1
1/4

ఆపదలో ఆడబిడ్డ !

ఆపదలో ఆడబిడ్డ ! 2
2/4

ఆపదలో ఆడబిడ్డ !

ఆపదలో ఆడబిడ్డ ! 3
3/4

ఆపదలో ఆడబిడ్డ !

ఆపదలో ఆడబిడ్డ ! 4
4/4

ఆపదలో ఆడబిడ్డ !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement