ట్రాక్టర్ల యజమానుల నిరసన
పెనుగొండ: ఇసుక ర్యాంపులో ట్రాక్టర్లలో ఇసుక లోడింగ్‌కు అనుమతించకపోవడంతో ట్రాక్టర్ యజమానులు నిరసన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కడింపాడు ఇసుక ర్యాంపులో కేవలం లారీలకు మాత్రమే ఇసుక లోడింగ్ అంటూ, ట్రాక్టర్లకు ఎగుమతి చేయడానికి నిరాకరించడంతో ట్రాక్టర్ల యజమానులు ఆగ్రహాం వ్యక్తం చేస్తూ పశ్చిమగోదావరి జిల్లా దొంగరావి పాలెం వద్ద నిరసన తెలిపారు. బుధవారం సాయంత్రం దొంగరావిపాలెం ఏటిగట్టుపై ఇసుక లారీల రాకపోకలను సైతం అడ్డుకున్నారు. ట్రాక్టర్లకు అనుమతి పత్రాలు కావాలంటూ దాటవేస్తున్నారని, లారీలకు ఇది వర్తించదా అని ప్రశ్నించారు. గంటపాటు జరిగిన నిరసన అనంతరం గొడవ సద్దుమణిగింది.
Comments
Please login to add a commentAdd a comment