నేటినుంచి జాతీయస్థాయి గో–కార్ట్ చాంపియన్ షిప్ పోటీలు
భీమవరం: స్థానిక ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం నుంచి నాలుగు రోజులపాటు జాతీయస్థాయి గో–కార్ట్ చాంపియన్ షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కేవీ మురళీకృష్ణంరాజు చెప్పారు. పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను బుధవారం కళాశాల డైరెక్టర్ ఎం జగపతిరాజు ఆవిష్కరించి వివరాలను వెల్లడించారు. పోటీల్లో విజేతలకు రూ.3 లక్షల వరకు బహుమతులు అందించనున్నట్లు చెప్పారు. పోటీల్లో పాల్గొనేందుకు పలు ఇంజనీరింగ్ కళాశాల నుంచి బృందాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్స్ వీవీ మురళీకృష్ణంరాజు, ఎన్‌ఎస్‌కే వర్మ, ఐఆర్‌పీ వర్మ, యు రాజేంద్రప్రసాద్, కె సురేష్‌బాబు పాల్గొన్నారు.
విద్యుదాఘాతంతో కూలీ మృతి
పెదవేగి : విద్యుదాఘాతంతో ఓ కూలీ అక్కడికక్కడే మృతి చెందాడు. పెదవేగి ఎస్సై కె రామకృష్ణ తెలిపిన వివరాలివి. పెదవేగి మండలం ముండూరుకు చెందిన బుడపన శ్రీను (40) కూలి పనికి వెళ్లి వస్తుండగా అతని చేతిలోని పామాయిల్ గెలలు నరికే ఇనుప రాడ్డు అదే గ్రామంలో ప్రమాదవశాత్తు కరెంటు తీగలకు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. శ్రీనుకు భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్సై చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment