ఏలూరు(మెట్రో): పీజీఆర్‌ఎస్, రెవెన్యూ సదస్సులో అందిన అర్జీలన్నింటిని సంతృప్తి స్థాయిలో పరిష్కరించాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ జి.జయలక్ష్మి అన్నారు. రాష్ట్ర సచివాలయం నుంచి జయలక్ష్మి అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏలూరు జిల్లా నుంచి కలెక్టర్ కె.వెట్రిసెల్వి హాజరయ్యారు. జి.జయలక్ష్మి మాట్లాడుతూ నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించిన భూములకు సంబంధించి ఉన్న మార్గదర్శకాలను, కాలానుగుణంగా జారీచేసిన ప్రభుత్వ ఉత్తర్వులను క్షుణ్నంగా పరిశీలించాలన్నారు. ఈ విషయంలో తలెత్తుతున్న పలు అంశాలను అధ్యయనం చేసేందుకు ఏలూరు, విశాఖపట్నం, తిరుపతి కలెక్టర్‌తో ఉప కమిటీని ఏర్పాటు చేశామన్నారు. రీ సర్వేలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలకు తక్షణమే పరిష్కారం చూపాలన్నారు. నమోదైన అర్జీలు గడువులోగా పరిష్కరించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment