ఏలూరు(మెట్రో): జిల్లాలో దేవదాయ భూముల పరిరక్షణపై కలెక్టరేట్‌లో కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధ్యక్షతన సమావేశం జరిగింది. అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకోవడం, ఉన్న భూముల పరిరక్షణ, లీజుదారుల నుంచి లీజు మొత్తాలను వసూలు చేయడం తదితర అంశాలపై దృష్టి సారించాలని నిర్ణయించారు. జిల్లాలో 25 మండలాల్లో దేవదాయ శాఖకు సంబంధించిన భూములను మండలాల వారీగా తయారుచేసి శుక్రవారం నాటికల్లా వివరాలు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. దేవదాయ భూముల పరిరక్షణకు సూచించిన మార్గదర్శకాలను సంబంధిత శాఖ అధికారులు అధ్యయనం చేసి అమలు చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment