ప్రశాంతంగా జేఈఈ మెయిన్స్
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జేఈఈ మెయిన్స్ పరీక్షలు నగరంలో ఏర్పాటు చేసిన రెండు కేంద్రాల్లో పటిష్ట ఏర్పాట్ల మధ్య బుధవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు పరీక్షలకు మొత్తం 551 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకూ ఒక సెషన్‌లో నిర్వహించగా మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ మరో సెషన్‌లో నిర్వహించారు. తొలి సెషన్‌లో సిద్ధార్థ క్వెస్ట్ పరీక్షా కేంద్రంలో మొత్తం 180 మంది విద్యార్థులకు 175 మంది హాజరయ్యారు. సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 102 మందికి గాను 99 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం పరీక్షలకు సిద్దార్థ క్వెస్ట్‌లో 180 మందికి గాను 177 మంది హాజరు కాగా, సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 104 మందికి గాను 100 మంది హాజరయ్యారు. సిద్ధార్థ క్వెస్ట్ పరీక్షా కేంద్రం వద్దకు ఆలస్యంగా వచ్చిన ఒక విద్యార్థినిని లోనికి అనుమతించకపోవడంతో సదరు విద్యార్థిని భోరున విలపించింది. సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో చివరి నిమిషంలో రావడంతో పరుగులు పెట్టి పరీక్షా హాలులోకి వెళ్లాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment