ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో వివిధ ప్రభుత్వ యాజమాన్యాల్లోని పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గెడ్డం సుధీర్ జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మను కోరారు. బుధవారం మర్యాద పూర్వకంగా కలుసుకున్న సుధీర్ వైఎస్‌ఆర్‌టీఏ ముద్రించిన నూతన సంవత్సర డైరీని అందచేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల నెలవారీ పదోన్నతులను పునరుద్ధరించాలని, యాప్‌ల భారం తొలగించేలా ప్రభుత్వంతో సంప్రదింపులు చేయాలని కోరారు. జిల్లా విద్యాశాఖాధికారిగా బాధ్యతలు స్వీకరించిన అనతికాలంలోనే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో అంకితభావంతో పని చేస్తున్నారని డీఈఓను ప్రశంసించారు. ఈ సందర్భంగా డీఈఓ వెంకటలక్ష్మమ్మ మాట్లాడుతూ ఉపాధ్యాయులు ప్రభుత్వ పథకాలను విద్యార్థులకు అందేలా సహకరించాలని, రానున్న 10వ తరగతి పరీక్షల్లో జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలపడానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment