సకాలంలో చికిత్స అందించాలి
ఏలూరు(మెట్రో): ఇంటింటి సర్వేలో భాగంగా కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించి సకాలంలో చికిత్స అందించాలని, వ్యాధిని సమూలంగా నిర్మూలించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 2 వరకు జిల్లావ్యాప్తంగా నిర్వహించే కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు కార్యక్రమంలో భాగంగా వ్యాధిపై అవగాహన పోస్టర్లు, కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ కుష్టు వ్యాధి నిర్మూలనలో భాగంగా ఫిబ్రవరి 2 వరకు కుష్టు వ్యాధి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.
దీపం పథకంపై సమీక్ష
ఏలూరు(మెట్రో): దీపం పథకం లబ్ధిదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై విచారించి 17 మంది ఎల్‌పీజీ డీలర్లకు నోటీసులు ఇచ్చామని జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి తెలిపారు. కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో బుధవారం దీపం పథకం అమలుపై జిల్లాలోని గ్యాస్ డీలర్లు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, పౌరసరఫరాల శాఖ అధికారులతో జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దీపం పథకంపై లబ్ధిదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై విచారణ అనంతరం రుజువైతే సదరు గ్యాస్ ఏజెన్సీలపై తగు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దీపం పథకంలో ఉచితంగా గ్యాస్ సిలిండర్లు పొందుతున్న సిలిండర్లకు చెల్లించిన నగదు మూడు రోజుల్లోపు తమ ఖాతాల్లో జమ అవుతున్నాయని పలువురు లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు. సమావేశంలో డీఎస్‌ఓ ఆర్.ఎస్.ఎస్ సత్యనారాయణ రాజు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ మేధావుల ఫోరం అధ్యక్షుడిగా నాగు
కై కలూరు: వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా ఇంటిలెక్చువల్(మేధావుల) ఫోరం అధ్యక్షుడిగా కై కలూరు నియోజకవర్గం, కలిదిండి మండలం పెదలంక గ్రామానికి చెందిన దుగ్గిరాల వెంకట నాగేశ్వరరావు(నాగు)ను పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్ మోహన్‌రెడ్డి ఆదేశాలతో నియమించినట్లు తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ప్రకటించింది. నాగు పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. తనకు జిల్లా పదవిని కేటాయించిన వైఎస్.జగన్ మోహన్‌రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్)కు నాగు కృతజ్ఞతలు చెప్పారు.
జిల్లా పోలీస్ డైరీ ఆవిష్కరణ
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా పోలీస్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించి ముద్రించిన పోలీస్ డైరీని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఎంతో కష్టపడి పోలీస్ సిబ్బందికి నిత్యం ఉపయోగపడేలా అనేక అంశాలను క్రోడీకరించి డైరీని రూపొందించిన పోలీస్ అధికారుల సంఘం, ఆర్‌ఐ పవన్‌కుమార్‌ను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్.నాగేశ్వరరావు, ఏఆర్ అదనపు ఎస్పీ ఎన్‌ఎస్‌ఎస్ శేఖర్, డీఎస్పీ డీ.శ్రావణ్‌కుమార్, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
పట్టిసీమ డీ–సిల్టేషన్ నుంచి అందుబాటులోకి ఇసుక
ఏలూరు(మెట్రో): జిల్లాలోని పట్టిసీమ డీ– సిల్టేషన్ ఇనుక పాయింట్ నుంచి ఈ నెల 24 నుంచి ప్రజలకు ఇసుక అందుబాటులో ఉంచేందుకు కార్యకలాపాలు ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇసుక కమిటీ చైర్మన్ కె.వెట్రిసెల్వి అధ్యక్షతన కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో బుధవారం జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. పట్టిసీమ డీసిల్టేషన్ ఇసుక పాయింట్ నుంచి పడవల ద్వారా ఇసుక తెచ్చేందుకు జిల్లా స్థాయి ఇసుక కమిటీ ఒక టన్నుకు రూ.165 డి–సిల్టేషన్ చార్జిగా నిర్ణయించారు. అడ్మినిస్ట్రేషన్, జీఎస్టీ తదితర చార్జీలను కలుపుకొని వినియోగదారుని ధర టన్నుకు రూ.198గా సమావేశంలో నిర్ణయించారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే కార్యకలాపాలు నిర్వహించాలని రోజుకు 400 టన్నుల వరకు మాత్రమే ఉత్పత్తి, సరఫరాకు పరిమితి విధించారు,
Comments
Please login to add a commentAdd a comment