మద్దతు ధరల చట్టం తేవాలి
ఏలూరు (టూటౌన్): రైతు మెడకు ఉరితాడులా వ్యవసాయ సాంకేతిక చట్టం, సహకార చట్టాన్ని కేంద్రం తీసుకువస్తోందని రైతు, వ్యవసాయ, కార్మిక సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఏలూరు పవరుపేటలోని అన్నే భవనంలో సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా సమావేశం నిర్వహించారు. 26న కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై జరుగుతున్న నిరసనలు,ర్యాలీలను విజయవంతం చేయాలని సమావేశం పిలుపునిచ్చింది. రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, బికేఎంయు జిల్లా అధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు, రైతు కూలీ సంఘం కార్యదర్శి షేక్ బాషా తదితరులు మాట్లాడారు. కొత్తగా తీసుకువచ్చిన సహకార చట్టం, వ్యవసాయ సాంకేతిక చట్టం రైతాంగాన్ని కార్పొరేట్ కంపెనీల పెత్తనం కిందకు తెచ్చేందుకేనని అన్నారు. సహకార వ్యవస్థలన్నీ కార్పొరేట్ కంపెనీల హస్తగతం అవుతాయని చెప్పారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధరల విధానమే ఇంక ఉండదన్నారు. వ్యాపారలు ఇష్టారాజ్యం అవుతుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment