టెక్‌జైట్ 25 వెబ్‌సైట్ ప్రారంభం
నూజివీడు: ఇంజినీరింగ్ విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు సాంకేతిక ఉత్సవాల నిర్వహణ ఎంతగానో దోహదపడుతుందని నూజివీడు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ పేర్కొన్నారు. వచ్చే నెలలో స్థానిక ట్రిపుల్ ఐటీలో నిర్వహించనున్న టెక్‌జైట్–25కు సంబంధించిన వెబ్‌సైట్‌ను బుధవారం డైరెక్టర్ ట్రిపుల్ ఐటీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తాము తయారు చేసిన ప్రాజెక్టులను ప్రదర్శించి వాటిపై ఫీడ్‌బ్యాక్‌ను తీసుకునేందుకు ఇదొక మంచి అవకాశమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో అంతర్గతంగా ఉన్న సృజనాత్మకతను, నాయకత్వ లక్షణాలను వెలుగులోకి తేవడంతో పాటు మెరుగుపరచడానికి ఉపయోగపడతాయన్నారు. ఏఓ బీ లక్ష్మణరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఐఐటీలు, ఎన్‌ఐటీలు, విశ్వవిద్యాలయాలను ఈ టెక్‌జైట్‌కు ఆహ్వానిస్తున్నామన్నారు. దీనిలో రోబోటిక్స్, ప్రాజెక్ట్ ఎక్స్‌పో, కోడింగ్, హ్యాకథాన్ తదితర అనేక రకాల పోటీలు నిర్వహిస్తారన్నారు. విజేతలకు రూ.5 లక్షల విలువైన బహుమతులు, సర్టిఫికెట్లు అందజేయడం జరుగుతుందన్నారు. టెక్‌జైట్–25లో పాల్గొనే వారు టెక్‌జైట్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. సీఏఓ బండి ప్రసాద్, ప్లేస్‌మెంట్ డీన్ పీ శ్యామ్, డీన్ అకడమిక్స్ రత్నాకర్, ఎస్‌డీసీఏసీ కన్వీనర్ జ్యోతీలాల్ నాయక్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment