ఆర్టీసీ కార్గోలో తణుకు ఫస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ కార్గోలో తణుకు ఫస్ట్‌

Published Thu, Jan 23 2025 1:36 AM | Last Updated on Thu, Jan 23 2025 1:37 AM

ఆర్టీ

ఆర్టీసీ కార్గోలో తణుకు ఫస్ట్‌

తణుకు అర్బన్‌ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్వహించిన కార్గో పార్శిల్స్‌ అండ్‌ కొరియర్‌ డోర్‌ డెలివరీ మాసోత్సవాల్లో తణుకు ఆర్టీసీ డిపో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. గత నెల 20 నుంచి ఈనెల 19వ తేదీ వరకు నిర్వహించిన మాసోత్సవాల్లో భాగంగా డిపోల వారీగా తణుకు డిపో 321 శాతం గ్రోత్‌తో మొదటి స్థానంలో నిలిచి సత్తా చాటింది. ఆర్టీసీ సంస్థ ఆదాయాన్వేషణలో భాగంగా ప్రవేశపెట్టిన కార్గో పార్శిల్‌ సర్వీస్‌ సేవలు ఇప్పుడు డోర్‌ డెలివరీ రూపంలో వినియోగదారుల ఆదరణ పొందుతున్నాయి. వ్యాపార, వాణిజ్య, రైతాంగ పార్శిల్స్‌ రూపంలో ఆర్టీసీ కార్గో ద్వారా సురక్షితంగా ఇంటి గుమ్మంలోకే చేరుస్తుండడంతో వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ బస్సులే మార్గమనే నినాదం తాజాగా కార్గో పార్శిల్స్‌ డోర్‌ డెలివరీల్లో కూడా అనుకరిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్ధేశించిన 80 ప్రాంతాల్లో కార్గో సెంటర్‌కు 10 కిలోమీటర్ల దూరంలోని ఇంటి గుమ్మంలోకి కార్గో డోర్‌ డెలివరీ సేవలు అందుతుండడంతో వినియోగదారులు అధికశాతం కార్గో కేంద్రానికే తమ పార్శిల్స్‌ అందజేస్తున్నారు.

ప్రత్యేక బహుమతులతో ఆకర్షణ

కార్గో డోర్‌ డెలివరీ మాసోత్సవాల్లో భాగంగా తణుకు డిపోలోని కార్గో కేంద్ర సేవలను వినియోగదారులు విశేషంగా ఆదరించారు. ముఖ్యంగా వినియోగదారులతోపాటు సంస్థ ఉద్యోగులు కూడా తమ వంతుగా ఈ మాసోత్సవాల్లో ప్రతి ఉద్యోగి స్వచ్ఛందంగా మూడు పార్శిల్స్‌ బుక్‌ చేయించాల్సిందిగా సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పిలుపునిచ్చారు. దీంతో సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులంతా తమ వంతుగా పార్శిల్స్‌ బుక్‌చేసి సహకరించారు. మాసోత్సవాల్లో వినియోగదారులను ఆకర్షించే రీతిలో డోర్‌ డెలివరీలకు సంబంధించి లక్కీ డిప్‌ల ద్వారా ప్రత్యేకమైన బహుమతులను తణుకు నరేష్‌ క్లాత్‌ షోరూమ్‌, షాలేం పెన్‌ కార్నర్‌ యాజమాన్యం సౌజన్యంతో అందజేశారు.

మూడో స్థానంలో తాడేపల్లిగూడెం

రాష్ట్రవ్యాప్తంగా కార్గో డోర్‌ డెలివరీ సేవల్లో డిపోల వారీగా తణుకు డిపో మొదటి స్థానంలో నిలవగా రెండో స్థానంలో ప్రొద్దుటూరు, మూడో స్థానంలో తాడేపల్లిగూడెం డిపో నిలిచినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఆయా ప్రాంతాల్లో జరిగే వ్యాపారాన్ని బట్టి టార్గెట్‌లు నిర్ధేశిస్తామని ఆ టార్గెట్‌లు బుకింగ్స్‌లో వచ్చిన గ్రోత్‌ శాతంతో స్థానాలు కేటాయిస్తారని తెలిపారు.

321 శాతం గ్రోత్‌తో రాష్ట్రంలో తణుకు డిపో మొదటి స్థానం

ముగిసిన డోర్‌ డెలివరీ మాసోత్సవాలు

వినియోగదారుల ఆదరణ అద్వితీయం

నిర్ధేశించిన 80 ప్రాంతాల్లో డిపో నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో ఇంటి గుమ్మంలోకే పార్శిల్‌ను చేరుస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 2023–24 సంవత్సరానికిగాను కార్గో ద్వారా ఇప్పటివరకు ఆర్టీసీకి రూ.190 కోట్లు ఆదాయం సమకూరింది. డోర్‌ డెలివరీ సేవల్లో తణుకు డిపో ప్రథమ స్థానంలో నిలవడం ఆ ప్రాంత వినియోగదారులు, ఉద్యోగుల కృషితో సాధ్యమైంది. త్వరలో పార్శిల్స్‌ డోర్‌ పికప్‌ కూడా ప్రారంభిస్తారు.

–జి.లక్ష్మీ ప్రసన్న వెంకట సుబ్బారావు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కమర్షియల్‌ మేనేజరు

వినియోగదారులు, ఉద్యోగుల కృషే

కార్గో డోర్‌ డెలివరీ మాసోత్సవాల్లో తణుకు డిపో ప్రథమ స్థానంలో నిలవడం చాలా సంతోషంగా ఉంది. వినియోగదారుల ఆదరణ, ఉద్యోగుల కృషితోనే ఈ ఘనత సాధించగలిగాం. మొదటి స్థానంలో నిలిచామని తెలియగానే తణుకు డిపోకు అధిక పార్శిల్స్‌ అందించిన శ్రీ లావణ్య ఫీడ్స్‌ ప్రొప్రైటర్‌ కోసూరి సతీష్‌వర్మతోపాటు కృషిచేసిన సంస్థ ఉద్యోగులను ఘనంగా సత్కరించుకున్నాం.

– సప్పా గిరిధర్‌కుమార్‌, తణుకు డిపో మేనేజరు

No comments yet. Be the first to comment!
Add a comment
ఆర్టీసీ కార్గోలో తణుకు ఫస్ట్‌ 1
1/2

ఆర్టీసీ కార్గోలో తణుకు ఫస్ట్‌

ఆర్టీసీ కార్గోలో తణుకు ఫస్ట్‌ 2
2/2

ఆర్టీసీ కార్గోలో తణుకు ఫస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement