ప్రభుత్వ తీరుపై అంబికా కృష్ణ అసంతృప్తి
ఏలూరు (టూటౌన్): కూటమి ప్రభుత్వం పనితీరు పట్ల బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలకు ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ఆహ్వానాలు, సమాచారాలు అందించకపోవడం బాధాకరమని చెప్పారు. ఏలూరులో మంగళవారం నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ నాయకులకు తగినంత ప్రాధాన్యత ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. అమిత్ షా విజయవాడ పర్యటనకు విచ్చేసిన సమయంలోనూ బీజేపీ కార్యకర్తలను, నాయకులను విస్మరించడం ఎంతో కలిచివేసిందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment