ఫైరింగ్‌లో మెలకువలు నేర్చుకోవాలి
కామవరపుకోట: ఫైరింగ్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొని మెలకువలు నేర్చుకోవాలని ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ అన్నారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో తడికలపూడిలో ఉన్న ఫైరింగ్ రేంజ్‌లో పోలీసు అధికారులు ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహించి, ఆయుధాల నైపుణ్యాలు పరీక్షించారు. ఈ సందర్బంగా ఎస్పీ వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్‌లో పాల్గొని ఫైరింగ్ సాధన చేశారు. పోలీసు అధికారులు తమ విధుల్లో భాగంగా వినియోగిస్తున్న ఆయుధాల పనితీరుపై పరిజ్ఞానం పెంపొందించుకోవాలన్నారు. ఫైరింగ్‌లో పాల్గొని మెలకువలు నేర్చుకోవాలన్నారు. ఫైరింగ్‌లో ప్రతిభ కనబరచిన పోలీసు అధికారులను ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎన్.సూర్య చంద్రరావు, ఏఆర్ అదనపు ఎస్పీ ఎన్‌ఎస్‌ఎస్ శేఖర్, డీఎస్పీలు పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా విరకమ్ కిషోర్
ఏలూరు (టూటౌన్): ఏలూరు జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా చౌటపల్లి విక్రమ్ కిషోర్ నియమితులయ్యారు. స్థానిక అశోక్ నగర్‌లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి ఎన్.శ్రీదేవి అధికారికంగా మంగళవారం ప్రకటించారు. మొత్తం ఐదుగురు పోటీపడగా.. అధిష్టానం సూచన మేరకు విక్రమ్ కిషోర్‌ను ఎన్నిక చేసినట్లు రిటర్నింగ్ అధికారి శ్రీదేవి, ఏఆర్‌ఓ రామకృష్ణారెడ్డి ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ, పలువురు నాయకులు అభినందించారు. అనంతరం జిల్లా ఆఫీసు నుంచి విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకున్నాం
ఏలూరు(మెట్రో): విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను కూటమి ప్రభుత్వం అడ్డుకుందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారం దేశ ఆర్థిక ప్రగతికి ఎంతగానో తోడ్పడుతుందన్నారు. ప్రధాని మోదీకి ఆంధ్రుల సెంటిమెంట్ వివరించి ప్రైవేటీకరణ ఆపించి ఆర్థిక ప్యాకేజీ వచ్చేలా చేశారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment