బాలికను వేధించిన బాలుడిపై కేసు
పెదవేగి: మైనర్ బాలికపై దాడి చేసి వేధించిన ఓ బాలుడిపై పెదవేగి పోలీసులు కేసు నమోదు చేశారు. పెదవేగి ఎస్సై కె.రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెదవేగి మండలం కొప్పాక గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలిక పట్ల అదే గ్రామానికి చెందిన బాలుడు ఈ నెల 20న సాయంత్రం నాలుగు గంటల సమయంలో బాలికను అడ్డగించి అసభ్యంగా ప్రవర్తించి, కింద పడవేసి కాలుతో తన్ని తనతో ఫోన్‌లో మాట్లాడమని వేధించాడు. చుట్టుపక్కల వారు రావడంతో బాలుడు అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ మేరకు మైనర్ బాలిక ఇచ్చిన రిపోర్టుతో కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నామని పెదవేగి ఎస్సై కె.రామకృష్ణ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
అత్తిలి: మండలంలోని బల్లిపాడు గ్రామంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందినట్లు ఎస్పై పి.ప్రేమరాజు తెలిపారు. గ్రామానికి చెందిన తోట అజయ్‌సాయి(23) మోటారు సైకిల్‌పై వెళుతుండగా గ్రామ శివారు పెదపాడు వద్ద ఎదురుగా వస్తున్న లారీను ఢీకొట్టడంతో తలకు తీవ్రగాయమైంది. క్షతగాత్రుడిని తణుకు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఆసుపత్రి నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రేమరాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment