కౌంటింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు
ఏలూరు(మెట్రో): ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపునకు కౌంటింగ్ కేంద్రంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలనీ కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. స్థానిక సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ సెంటర్‌ను శనివారం ఆమె పరిశీలించారు. మొత్తం 3,15,261 మంది ఓటర్లు ఉండగా 440 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. మార్చి 3న ఇక్కడ కౌంటింగ్ నిర్వహిస్తామన్నారు. ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, కాకినాడ జిల్లాలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు ఏలూరు జిల్లాకు చేరుకుంటాయని, వాటిని స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపరచాలన్నారు. ఫలితాలు ప్రదర్శించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేయాలన్నారు. డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, పెదపాడు తహసీల్దార్ కృష్ణ జ్యోతి, సర్వేయర్ రమణారావు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment