రాష్ట్రానికి రిక్తహస్తం
కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధుల కేటాయింపు విషయంలో మొండిచేయి చూపారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న కూటమి ప్రభు త్వం నిధులు తీసుకురావడంలో పూర్తిగా విఫలమైంది. ఏలూరు జిల్లాలో గిరిజన ప్రాంతాల అభివృద్ధికి నిధులు, ఆక్వా అభివృద్ధికి ప్రోత్సాహకాలు ఎంతమాత్రం లేవు.
– దూలం నాగేశ్వరరావు,
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు
మధ్యతరగతికి మేలు చేసేలా..
కేంద్ర బడ్జెట్ బాగుంది. తొలిసారిగా మధ్యతరగతి కుటుంబాల గురించి మాట్లాడిన బడ్జెట్ ఇది. రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు మేలు చేస్తుంది. క్యాన్సర్ మందులపై పూర్తి పన్ను రాయితీ ఇచ్చారు. సెల్‌ఫోన్, కారు బ్యాటరీలకు పన్ను రాయితీలతో ఎలక్ట్రిక్ కార్లు, సెల్‌ఫోన్ల ధరలు తగ్గుతాయి.
– అంబికా కృష్ణ, బీజేపీ రాష్ట్ర నాయకుడు
కేటాయింపులు తగ్గించారు
వ్యవసాయ, విద్య, ప్రజా రో గ్యం, సామాజిక సంక్షేమ రంగాలకు కేటాయింపులు తగ్గించారు. బీమా రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐ ప్రైవేటీకరణ చేస్తామని ప్రకటించడం అన్యాయం. ఇప్పటికే టెలికాం, విద్యుత్, రైల్వే, పోర్టులు, బ్యాకింగ్ తదితర సేవలు ప్రైవేటీకరించారు. నూటి కి నూరు శాతం ప్రైవేటీకరణతో నష్టం తప్పదు
– పి.కిషోర్, పట్టణ నివాస ప్రాంతాల సంఘం జిల్లా కన్వీనర్
వికసిత్ భారత్‌కు అద్దం
కేంద్ర బడ్జెట్ ప్రధాని మోదీ వికసిత్ భారత్ దార్శినికతకు అద్దం పట్టింది. పోలవరం ప్రా జెక్టుకు రూ.5,936 కోట్లు, ప్రాజెక్టు అథారిటీకి రూ.54 కోట్లు కేటాయించడం ఆహ్వానించదగ్గ పరిణామం. సవరించిన అంచనాలకు ఆమోదం తెలిపారు. పన్ను మినహాయింపు శుభపరిణామం.
–పుట్టా మహేష్‌కుమార్, ఎంపీ, ఏలూరు
Comments
Please login to add a commentAdd a comment