బడ్జెట్‌లో జిల్లాకు మొండిచేయి
కేంద్ర బడ్జెట్‌లో యథావిధిగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు మొండిచేయి చూపారు. పోలవరం ప్రాజెక్టుకు కొద్దిగా నిధుల మంజూరు, వేతన జీవులకు శ్లాబ్ పెంపు మినహా ఎలాంటి ప్రయోజనం దక్కలేదు. వ్యవసాయ, ఆక్వా రంగాలకు ప్రోత్సాహాలు దక్కని పరిస్థితి. రైల్వే ప్రాజెక్టుల ఊసేలేదు. జిల్లా రూపురేఖలు మారుస్తాం అంటూ కూటమి నేతల హడావుడి తప్ప కార్యరూపం దిశగా కనీసం యోచించే పరిస్థితి లేదు.
ఆదివారం శ్రీ 2 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి జిల్లావాసులు కేంద్ర బడ్జెట్‌పై గంపెడాశలు పెట్టుకున్నా ఏటా మాదిరిగా నిరాశే ఎదురైంది. జిల్లాలో ఆక్వా సాగు, ఎగుమతుల వ్యాపారంతో పాటు వాణిజ్య పంటలైన పొ గాకు, కోకో, ఆయిల్‌పామ్ సాగు అధికంగా ఉంది. అలాగే తాడేపల్లిగూడెంలో నిట్ విద్యాసంస్థ, నరసాపురం అంతర్జాతీయ ఎగుమతి ఖ్యాతి ఉన్న లేసు పరిశ్రమలు ఇలా పలు రంగాలు కేంద్ర ప్రోత్సాహకాలు, సుంకాల రద్దు కోసం ఎదురుచూస్తున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. రైతులకు ఎటువంటి ప్రయోజనం చేకూరలేదు. కేంద్రసహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ కేంద్రం నిధులతో పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు జిల్లాను అభివృద్ధి చేస్తానని చెప్పినా ఆచరణలో కనిపించని పరిస్థితి.
‘ఆక్వా’ంక్షలు ఫలించలేదు
ఉమ్మడి జిల్లాలో 2.40 లక్షల ఎకరాలలో ఆక్వా సాగు ఉంది. రాష్ట్రంలోనే అత్యధికంగా సుమారు 4 లక్షల మంది దీనిపై ఆధారపడి ఉన్నారు. ఏటా సుమారు 20 వేల కోట్ల ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. ఆక్వా, అనుబంధ పరిశ్రమలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. బడ్జెట్‌లో ఆక్వా రైతులకు ప్రో త్సాహకాలు, ఫిషింగ్ హార్బర్, ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రతిపాదనలను పట్టించుకోలేదు. చేప ముక్కలు శీతలీకరణం చేసి ఎగుమతి చేస్తే గతంలో 30 శాతం ఉన్న కస్టమ్స్ డ్యూటీను 5 శాతానికి తగ్గించినా రైతులకు ఉపయోగం లేదు.
వ్యవ‘సాయానికి’ దక్కని మద్దతు
ఉమ్మడి జిల్లాలో ఏటా సుమారు 10 లక్షల ఎకరాల్లో సుమారు 4.20 లక్షల మంది రైతులు పలు రకాల పంటలు పండిస్తున్నారు. పంటలకు మద్దతు ధర ప్రకటించకపోవడం, ఎరువులపై సబ్సిడీ పెంపు, మద్దతు ధరలపై గ్యారంటీ అమలు చట్టం వంటి డిమాండ్ల నెరవేరలేదు. ఆయిల్‌పామ్, కోకో మొక్కలకు పూర్తి సబ్సిడీ డిమాండ్ పట్టించుకోలేదు.
జిల్లాలో 5.30 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు ఆదాయపన్ను శ్లాబ్ పెంచడంతో ఊరట లభించింది. జిల్లాలో వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగులకు టీడీఎస్ భారం తగ్గింది
న్యూస్‌రీల్
ఆర్‌అండ్‌ఆర్‌కు నిల్
పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936 కోట్లు, ప్రాజెక్టు అథారిటీకి రూ.54 కోట్లు కేటాయించారు. కీలకమైన ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మూడు ముంపు మండలాల్లోని 126 గ్రామాలకు చెందిన దాదాపు 25,100 కుటుంబాలను పునరావాస ప్యాకేజీ ఇవ్వాల్సి ఉంది. సుమారు రూ.32 వేల కో ట్లకుపైగా పునరావాసానికి కేటాయించాల్సి ఉండగా పట్టించుకోలేదు. పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్ల ఎత్తుతోనే పూర్తిచేసేందుకే బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నట్టు ప్రకటించడం ఆందోళన కలిగిస్తోంది. వాస్తవానికి 45.72 మీటర్ల ఎత్తుతో పోలవరం ప్రాజెక్టును నిర్మించాల్సి ఉంది.
రైల్వేకు కేటాయింపుల్లేవు
జిల్లాలో నరసాపురం–కోటిపల్లి రైల్వేలైన్‌ను 2016లో ప్రారంభించినా నిధులు మంజూరు కాక నిలిచిపోయాయి. అలాగే రూ.923 కోట్లతో కొవ్వూరు–భద్రాచలం రైల్వేలైన్ ఆమోదముద్ర వేసినా బడ్జెట్ కేటాయింపులు లేవు. ఈ బడ్జెట్‌లో అయినా ఏ మేరకు కేటాయింపులు చేశారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
మరోసారి నిరాశే..
జిల్లాకు దక్కని ప్రాధాన్యం
ఆర్‌అండ్‌ఆర్ ఊసెత్తని వైనం
ఆక్వా, వ్యవసాయ, లేసు ఉత్పత్తులకు దక్కని ప్రాధాన్యం
రైల్వే ప్రాజెక్టులపై స్పష్టత కరువు
పోలవరానికి రూ.5,936 కోట్ల కేటాయింపు
నరసాపురం లేసుకు దక్కని గుర్తింపు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మెట్టినిల్లు నరసాపురం లేసు పరిశ్రమ అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందినా కేంద్ర ప్రభుత్వం గుర్తించని పరిస్థితి. లేసు ఎగుమతులు పదేళ్ల కిత్రం ఏటా రూ.200 కోట్లు ఉండగా కొన్నేళ్లుగా రూ.80 కోట్లకు తగ్గాయి. నరసాపురం లేసుకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్నా ముడిసరుకుపై పన్నుల మినహాయింపు, ఎగుమతి సుంకాల రద్దు, కేంద్ర ప్రభుత్వ రాయితీలు, ప్రోత్సాహకాలు అందడం లేదు. దీంతో సులభంగా మార్కెటింగ్ చేయలేక పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుంది. బడ్జెట్‌లో అల్లికల దుస్తులపై 10 శాతం పన్నును 20 శాతానికి పెంచడం అదనపు భారం. తాడేపల్లిగూడెం నిట్‌కు ఏటా రూ.250 కోట్లు కేటాయించాల్సి ఉన్నా అటకెక్కించారు.
Comments
Please login to add a commentAdd a comment