ఏలూరు(టూటౌన్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ సురేష్‌రెడ్డి శనివారం ఉమ్మడి జిల్లాలోని న్యాయమూర్తులతో ఏలూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో జ్యూడిషియల్ కాన్ఫరెన్స్ నిర్వహించా రు. కేసులను త్వరితగతిన విచారించి తీర్పులు వెలువరించాలని, తీర్పుల్లో నాణ్యత లోపించకూడదన్నారు. సివిల్ కేసులు, విచారణలో ఉన్న ఖైదీల కేసుల్లో త్వరితగతిన తీర్పులను వెలువరించడానికి ప్రయత్నించాలని సూచించారు. ప్రధాన న్యాయమూర్తి (ఎఫ్‌ఏసీ) ఎం. సునీల్‌కుమార్ ఉమ్మడి జిల్లాలో పెండింగ్ కేసుల వివరాలు, భవన సముదాయాల పరిస్థితులపై ఆయన వివరించారు. జిల్లా న్యాయమూర్తులు, సీనియర్ సివిల్ జడ్జిలు, జూనియర్ సివిల్ జడ్జిలు పాల్గొన్నారు.
కోడ్ అమలుకు ప్రత్యేక బృందాలు
ఏలూరు(మెట్రో): ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లా పట్టభధ్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియామవళి (కోడ్) అమలుకు ప్రత్యేక బృందాలను నియమిస్తూ కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఉత్తర్వులు జారీచేశారు. 22 ఎంసీసీ, 21 స్పెషల్ వీడియో బృందాలు ఏర్పాటుచేశారు. భీమడోలు, దెందులూరు, ఏలూరు రూరల్, నిడమర్రు, పెదపాడు, పెదవేగి, చింతలపూడి, ఉంగుటూరు, లింగపాలెం, వేలేరుపాడు, పోలవరం, జీలుగుమిల్లి, కామవరపుకోట, జంగారెడ్డిగూడెం అర్బన్, రూరల్, బుట్టాయగూడెం, ద్వారకాతిరుమల, కుక్కునూరు, టి.నరసాపురం, కొయ్యలగూడెం మండలాలకు ఒక్కో బృందం, ఏలూరు కార్పొరేషన్‌కు రెండు ఎంసీసీ బృందాలను ఏర్పాటుచేశారు. వీరు రోజువారీ నివేదికలను ఆర్డీఓలకు సమర్పించాలని పేర్కొన్నారు.
పీజీఆర్‌ఎస్ నిలుపుదల
ఏలూరు(మెట్రో): జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. ఏలూరు కలెక్టరేట్, ఆర్డీఓ, మండల, మున్సిపల్ కార్యాలయాల్లో కార్యక్రమాన్ని నిలుపుదల చేసినట్టు పేర్కొన్నారు.
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్మీడియెట్ పబ్లిక్ సన్నాహక పరీక్షల్లో భాగంగా శనివారం ఫస్టియర్ విద్యార్థులకు నిర్వహించిన ఎథిక్స్, హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్షకు 17,849 మంది హాజరయ్యారు. జిల్లాలోని 137 కళాశాలల్లో జనరల్ విద్యార్థులు 15,999 మందికి 15,590 మంది, ఒకేషనల్ విద్యార్థులు 2,459 మందికి 2,259 మంది హాజ రయ్యారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.చంద్రశేఖరబాబు తెలిపారు.
తాబేళ్ల మృతిపై విచారణ
భీమవరం(ప్రకాశం చౌక్): మృతి చెందిన తాబేళ్లు సంఘటనపై వెంటనే విచారణ చేయాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో అటవీ, మత్స్యశాఖల అధికారులతో సమావేశమై మృతిచెందిన తాబేళ్లు చినమైనివారిలంక, పెద్దమైనివారిలంక తీర ప్రాంతానికి కొట్టుకు రావడానికి కారణాలపై సమీక్షించారు. పర్యావరణ హితమైన సముద్ర జీవులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జిల్లాలోని తీర ప్రాంతానికి పదుల సంఖ్యలో మృత తాబేళ్లు కొట్టుకురావడం ఆందోళన కలిగించే అంశం అన్నారు. అటవీ, మత్స్య, పశుసంవర్ధక శాఖల అధికారులతో విచారణ బృందాన్ని నియమించినట్టు చెప్పారు. తాబేళ్లు గుడ్లు పెట్టే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు వలలను నిషేధించాలని మత్స్యకారులకు అవగాహన కల్పించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment