నిర్వాసితులకు అన్యాయం
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులపై కేంద్రం నిర్లక్ష్యం వహిస్తోంది. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీకి సుమారు రూ.32 వేల కోట్లు అవసరమైనా కేటాయింపులు లేవు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీకి నిధులు ఇవ్వలేదు.
– బండి వెంకటేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు
పరిశోధనలపై ఆసక్తి
ఐఐటీ, ఐఐఎస్‌సీల్లో 10 వేల మంది విద్యార్థులకు ఫెలోషిప్ ప్రకటించడంతో పరిశోధనలపై ఆసక్తి పెరుగుతుంది. సుమారు 10 వేల మెడికల్ సీట్లు పెంచడం సంతోషదాయకం. ఎంఎస్‌ఎంఈ, స్టార్టప్ కంపెనీల అభివృద్ధికి రుణాలు మంజూరుతో నూతన పారిశ్రామికవేత్తలు ఎదుగుతారు.
– డాక్టర్ తేర రాజేష్, ఎంబీఏ ఆచార్యులు, సీఆర్ రెడ్డి పీజీ కళాశాల, ఏలూరు
రైతులకు రిక్తహస్తం
బడ్జెట్‌లో రైతులకు మొండిచేయి చూపారు. మద్దతు ధరలు గ్యారెంటీ చట్టంపై హామీ ఇవ్వకపోవడం రైతులను మోసగించడమే. ఎరువులు సబ్సిడీ మరింత పెంచాలి. పోలవరం ప్రాజెక్టుకి నామమాత్రపు కేటాయింపులతో ప్రయోజనం లేదు.
–కె.శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి
●
Comments
Please login to add a commentAdd a comment