దెందులూరు: దెందులూరు మండలంలోని గోదావరి కాలువపై పెద్ద పెద్ద చెట్లను కొంతమంది ఉద్యోగుల సహకారంతో కొట్టేసి అమ్మేసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిని ఉన్నతాధికారుల దృష్టికి స్థానికులు తీసుకెళ్లినా పట్టించుకోలేదు. 1988లో దెందులూరు గ్రామానికి చెందిన కొంతమంది పేదలకు చెట్టు పట్టా పథకంలో కొంత భూమిని మొక్కలు పెంచుకునేందుకు ఇచ్చింది. ఆ భూమిలో అక్రమార్కులు పెద్ద చెట్లను కొట్టేస్తున్నారంటూ గ్రామానికి చెందిన కొంతమంది ఎంపీడీవో, ఇరిగేషన్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. మండల రెవెన్యూ సిబ్బంది శనివారం సాయంత్రం కాలువ గట్టును పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment