తాడేపల్లిగూడేనికి మకాం మార్చిన రేలంగి
తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం సమీపంలో 1910 ఆగస్టు 10న జన్మించిన రేలంగి వెంకట్రామయ్య.. హరికథ కథకుడిగా అరంగేట్రం చేశారు. హార్మోనియం కళాకారుడిగా పద్యాలకు, పాటలకు జీవం పోశారు. నటనపై ఆసక్తితో ఆయన ప్రయాణం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి మారింది. 1935లో సి.పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీకృష్ణతులాభారం’ సినిమా ద్వారా చిత్రరంగ ప్రవేశం చేసిన ఆయన విజయా సంస్థలో అవకాశాల ద్వారా వెనక్కితిరిగి చూడలేదు. హాస్యానికి, అభినయానికి రేలంగి చిరునామాగా మారారు. 1975లో ‘పూజ’ చిత్రంలో నటించే వరకు సుమారు 300 సినిమాలకు పైగా నటించారు. తన ఉన్నతికి బాసటగా నిలిచిన తాడేపల్లిగూడెంలో రేలంగి చిత్రమందిర్ సినిమా హాలును కట్టారు. తెలుగు చలన చిత్ర రంగంలో తొలి పద్మశ్రీ అవార్డు అందుకున్న హాస్యనటుడు ఆయనే.
Comments
Please login to add a commentAdd a comment