ఎస్సీ వర్గీకరణ ఆపాలి
పెంటపాడు: ఎస్సీ వర్గీకరణను ప్రభుత్వం తక్షణం మానుకోవాలని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు డిమాండ్ చేశారు. శనివారం పెంటపాడులోని బస్టాండ్ సెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆయన నిరాహార దీక్ష చేపట్టారు. మద్దతుగా దళిత సంఘాల నాయకులు పాల్గొని దీక్షకు సంఘీభావం ప్రకటించారు. మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు మంగరాజు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ స్వలాభం కోసం తప్ప దళితులను ఆదుకొనే ఉద్దేశం లేదన్నారు. ఆగస్టు 1 నాటికి ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ క్లాసిఫికేషన్ వ్యవహరాలను పార్లమెంట్‌లో చర్చకు పెట్టి న్యాయం చేయాలన్నారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా ఎస్సీలకు 25 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ పెంచాలన్నారు. రాజ్యాంగ ధర్మ పరిషత్ ఫౌండర్ ఏన్‌ఏడీ పాల్, తెలంగాణ మాలమహానాడు అధ్యక్షుడు మంత్రి నరసింహయ్య, ఏపీ మాలమహానాడు అధ్యక్షుడు గోదా జాన్‌పాల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment