గ్రీన్‌ఫీల్డ్ మాటున అక్రమ దందా
కొయ్యలగూడెం: అక్రమ గ్రావెల్ తవ్వకాలకు యర్రంపేట పంచాయతీ పరిధిలోని రెవెన్యూ ప్రాంతం అడ్డాగా మారింది. యర్రంపేట పుంత రోడ్డు నుంచి నల్లజర్ల మండలం సుభద్ర పాలెంకు వెళ్లే మెట్ట ప్రాంతంలో గ్రావెల్ తవ్వకాలు కొనసాగుతున్నాయి. గ్రీన్‌ఫీల్డ్ హైవే నిమిత్తం సుభద్రపాలెం పరిధిలోని రెవెన్యూ ప్రాంతంలో గ్రావెల్ తవ్వకాలు కొనసాగిస్తుండగా ఇదే అదునుగా రెడ్ బుక్ బ్యాచ్ గ్రావెల్ అక్రమ రవాణాకు తెరలేపింది. దీంతో సందట్లో సడేమియాగా గ్రీన్ ఫీల్డ్ హైవే మాటున రెడ్ బుక్ బ్యాచ్ రేయింబవళ్లు గ్రావెల్ రవాణా కొనసాగిస్తుంది. గ్రావెల్ అక్రమ రవాణాకు సంబంధించి సమాచారం ఇస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోతుందని రైతులు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదు చేసిన కొద్దిసేపటికి అక్రమార్కులకు విషయం తెలిసి సర్దుకుంటున్నారని దీంతో అధికారులు వెళ్లేసరికి అక్రమ రవాణాకు సంబంధించిన సాక్ష్యాలు లేకుండా పోతున్నాయంటున్నారు. రెడ్ బుక్కు బ్యాచ్ గ్రావెల్ అక్రమ రవాణాకు అధికారులు సైతం సహకరిస్తున్నారనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అడ్డుకట్ట వేయాల్సిన వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు ఎమ్మెల్సీ ఎన్నికల విధులలో నిమగ్నమై ఉండటం, లేదా వీవీఐపీల పర్యటనలో ఉండడం అక్రమార్కులకు కలిసి వస్తున్నట్లు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment