వైఎస్సార్‌సీపీ జోలికొస్తే ఊరుకోం
ఆగిరిపల్లి : వైఎస్సార్‌సీపీ జెండా దిమ్మల జోలికి వస్తే సహించమని జెడ్పీటీసీ సభ్యుడు పిన్నిబోయిన వీరబాబు హెచ్చరించారు. ఆగిరిపల్లిలో పంచాయతీ స్థలాన్ని ఆక్రమించుకోవాలని దురుద్దేశంతో ఓ వ్యక్తి శనివారం అర్ధరాత్రి అక్కడే ఉన్న వైఎస్సార్‌సీపీ జెండా దిమ్మను పొక్లయిన్‌తో ధ్వంసం చేశారు. విషయం తెలిసిన పార్టీ నాయకులు భారీగా తరలివచ్చి నిరసన తెలిపారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పల్లగాని నరసింహారావు, మండల అధ్యక్షుడు బెజవాడ రాంబాబు ఆక్రమణదారుడిని నిలదీశారు. దీంతో అతడు క్షమాపణ చెప్పి జెండా దిమ్మను 24 గంటల్లోపు పునర్నిర్మించారు. దీనిపై కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ పార్టీ దిమ్మల జోలికి వస్తే సహించబోమని హెచ్చరించారు. ఈదులగూడెం మాజీ సర్పంచ్ ఈలప్రోలు సుబ్బయ్య, ఎంపీటీసీ సభ్యుడు సాధంగోపి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు నక్కనబోయిన పండు, జిల్లా నాయకురాలు సుజన కుమారి, పార్టీ మండల ఉపాధ్యక్షుడు రవిశేఖర్, నియోజవర్గ సోషల్ మీడియా కన్వీనర్ వాకా సక్కేశ్వరరావు, ఎస్సీ నాయకులు కంబాల ప్రదీప్, కోరుకొండ రమేష్, ఆగిరిపల్లి పార్టీ అధ్యక్షుడు చిమట శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment