
నాకు నెలసరి టైమ్‌లో సివియర్‌గా నడుము నొప్పి, మూడ్ స్వింగ్స్, ఇరిటేషన్ ఉంటున్నాయి. నా ఈ సమస్యల వల్ల మా భార్యాభర్తల మధ్య రిలేషన్ కూడా ఎఫెక్ట్ అవుతోంది. పిల్లల కోసం ఇంకా ప్లాన్ చేయలేదు. ఎండోమెట్రియాసిస్ ఉందని చెప్పారు. నాకు మందులు పనిచెయ్యడం లేదు. ఏదైనా నాన్‌మెడిసినల్ ట్రీట్‌మెంట్ ఉంటే చెప్పండి.. ప్లీజ్.. – వింధ్య, ఏలూరు
మీరు చెప్పిన సింప్టమ్స్ చాలామంది మహిళల్లో కనపడతాయి. ఎండోమెట్రియాసిస్, అడెనోమయాసిస్, బ్లాడర్ పెయిన్ సిండ్రోమ్ లాంటి కండిషన్స్‌లో పెయిన్ మేనేజ్‌మెంట్ చాలా ఇబ్బంది పెడుతుంది. సెల్ఫ్ మేనేజ్‌మెంట్ స్ట్రాటజీస్ ఫాలో అయ్యేవారిలో మందులు అవసరం లేకుండా బెటర్ లైఫ్‌ని లీడ్ చేయవచ్చు. దీనికి పాజిటివ్ ఆటిట్యూడ్ చాలా అవసరం.
టైమ్ మేనేజ్‌మెంట్, సోషల్ వెల్‌బీయింగ్, ఎడ్యుకేషన్, ఎక్సర్‌సైజ్, ఫిజికల్ వెల్‌బీయింగ్, ఎమోషనల్ వెల్‌బీయింగ్, డైట్ వంటివి దోహదపడతాయి. 7–9 గంటల నిద్ర, మైండ్‌ఫుల్‌నెస్, రిలాక్సేషన్ టెక్నిక్స్ కూడా హెల్ప్ అవుతాయి. డైట్‌లో పాలు, యోగర్ట్, చీజ్, బీన్స్, గింజధాన్యాలు, గ్లూటెన్ వీట్ వంటివి అవాయిడ్ చెయ్యాలి. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్‌లో ఏ ఆహారం తీసుకుంటే మీకు సింప్టమ్స్ పెరుగుతున్నాయో గమనించుకోవాలి. దాన్ని బట్టి సదరు ఆహారానికి దూరంగా ఉండాలి. ద్రవపదార్థాలు, పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. మలబద్ధకం లేకుండా చూసుకోవాలి.
ఎక్కువ ఒత్తిడి ఫీల్ అవకుండా టైమ్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ అలవరచుకోవాలి. దిగులుగా ఉన్నప్పుడు మీ ఆప్తులతో మీ దిగులును షేర్ చేసుకోండి. 24 గంటలు అందుబాటులో ఉండే ఆన్‌లైన్ హెల్ప్ లైన్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి వాకబు చేసి.. వారితో మాట్లాడండి. మేనేజ్‌మెంట్ స్ట్రాటజీస్‌కి సంబంధించి కొన్ని ఆన్‌లైన్ యాప్స్ కూడా ఉన్నాయి. వాటి హెల్ప్ తీసుకోండి. ఎండోమెట్రియాసిస్‌కి కామన్ ట్రీట్‌మెంట్ అంటూ ఏమీ లేదు. మందుల కన్నా ఇలాంటి కోపింగ్ స్ట్రాటజీస్‌ని అలవాటు చేసుకోవడమే మంచిది.
డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment