అణగారిన వర్గాలకు రాజ్యాధికారం వైఎస్‌ జగన్‌తోనే సాధ్యం | Sakshi
Sakshi News home page

అణగారిన వర్గాలకు రాజ్యాధికారం వైఎస్‌ జగన్‌తోనే సాధ్యం

Published Tue, May 7 2024 11:20 AM

అణగారిన వర్గాలకు రాజ్యాధికారం వైఎస్‌ జగన్‌తోనే సాధ్యం

తాడేపల్లిరూరల్‌: అణగారిన వర్గాలకు రాజ్యాధికారం వైఎస్సార్‌ సీపీతో సాధ్యమని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) పేర్కొన్నారు. దుగ్గిరాల గ్రామ ప్రజలు, యానాదుల ఆత్మీయ సమావేశం సోమవారం నిర్వహించారు. సమావేశానికి ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకట సుబ్బయ్య, మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మే 13న మన రాష్ట్రంలో మన భవిష్యత్తు నిర్ణయించుకునే సమయం వచ్చిందని, ఆ రోజు మనందరం ఆలోచించి మనకు మంచిచేసే ప్రభుత్వాన్ని ఎంచుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన కొనసాగించారని వివరించారు. ఎన్నికల్లో ఫ్యాను గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి గుంటూరు పార్లమెంట్‌ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్య, మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్యను అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు. యందేటి వెంకట సుబ్బయ్య, ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య మాట్లాడుతూ గిరిజనులకు అవసరం అయిన సంక్షేమ పథకాలు అందించి, వారి అభివృద్ధికి కృషి చేసిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని అన్నారు. 5 సంవత్సరాల కాలంలో మనకు అన్ని విధాలా మంచి చేసిన జగన్‌కు మనం తోడుగా నిలవాల్సిన సమయం వచ్చిందని, ప్రతి ఒక్కరూ ఫ్యాను గుర్తుపై ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్టీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చౌటూరి రమేష్‌, గుంటూరు జిల్లా వైఎస్సార్‌ సీపీ నాయకులు కొమరగిరి సూరిబాబు, రాపూరి గోపి, రాపూరి రాజేష్‌, కొమరగిరి మరియమ్మ, పొట్లూరి అశోక్‌, ఇళ్ళ గరటయ్య, బొజ్జ కోటయ్య పాల్గొన్నారు.

ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) హాజరైన అసెంబ్లీ అభ్యర్థి లావణ్య, ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకట సుబ్బయ్య

 
Advertisement
 
Advertisement