ఇద్దరు హాస్టల్‌ విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు హాస్టల్‌ విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం

Published Tue, Nov 19 2024 2:31 AM | Last Updated on Tue, Nov 19 2024 2:31 AM

ఇద్దరు హాస్టల్‌ విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం

ఇద్దరు హాస్టల్‌ విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం

సత్తెనపల్లి: సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థినుల పట్ల సిబ్బంది దుష్ప్రవర్తన, వేధింపులకు ఆస్కారం లేకుండా చూడాలని హైకోర్టు స్పష్టంగా నిర్దేశించి నాలుగు రోజులైనా గడవకముందే.. సిబ్బంది వేధింపులతో ఇద్దరు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సంచలనం కలిగించింది. సత్తెనపల్లిలోని ఎస్సీ బాలికల కళాశాల వసతిగృహంలో ఇద్దరు ఇంటర్‌ విద్యార్థినులు సంగం అఖిల, అన్నవరపు సనిత వార్డెన్‌, సిబ్బంది వేధింపులు తాళలేక ఆత్మహత్యా యత్నం చేశారు. అధికసంఖ్యలో డోలో–650 మాత్రలు మింగిన వారు ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్‌లో కోలుకుంటున్నారు. ఈనెల 15న మధ్యాహ్నం మిగిలిన అన్నాన్ని రాత్రి వడ్డించడంతో అఖిల, సనిత ప్రశ్నించారు. దీంతో హాస్టల్‌ వార్డెన్‌ రాణెమ్మ, వంట సిబ్బంది వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సనితపై దాడికి యత్నించారు. శనివారం హాస్టల్‌కు వచ్చిన తల్లిదండ్రులకు సనిత విషయం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వార్డెన్‌ రాణెమ్మకు కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపారు. ఆదివారం అఖిల, సనితలను వార్డెన్‌, సిబ్బంది అవమానించడంతో తట్టుకోలేక వారు మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement