2023 జూన్ 14న మార్టిగేజ్ పద్ధతిలో రూ.42 లక్షలకు 2870–2023 ఎండార్స్‌మెంట్ డాక్యుమెంట్ ద్వారా రుణం పొందా. తీసుకున్న రుణాన్ని 2024 జూన్ 1న చెల్లు రశీదు డాక్యుమెంట్ నంబరు 2636–2024 ద్వారా చెల్లించా. చెల్లు రశీదు కూడా ఇచ్చారు. కుటుంబ అవసరాల నిమిత్తం ఆ స్థలాన్ని అమ్మకానికి పెట్టగా ఈసీలో తనఖా పెట్టినట్టు చూపిస్తోంది. దీనికోసం చెల్లు రశీదుసు తీసుకుని రెండు నెలలుగా రిజిస్ట్రార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేదు. సీనియర్ అసిస్టెంట్ సత్యనారాయణను సంప్రదించగా, నెల పట్టవచ్చు, ఆరు నెలలు పట్టవచ్చు సంవత్సరం పట్టవచ్చు అని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. ఐజీ కార్యాలయంలో తప్పు దొర్లితే తమకేం సంబంధం ఉంటుందని దురుసుగా మాట్లాడుతున్నారు. న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నా.
– షేక్ అల్లావుద్ధీన్, గుంటూరు జిల్లా టీడీపీ మైనార్టీసెల్ అధికార ప్రతినిధి
●
Comments
Please login to add a commentAdd a comment