శ్రీశృంగేరీ శారదా పీఠం ఉత్తరాధికారి ఆశీర్వచనం
పెదకాకాని: శ్రీశృంగేరీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ విదుశేఖర భారతీ మహాస్వామి వీవీఐటీ కళాశాలను సందర్శించారు. కళాశాల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, అరుణప్రియ దంపతులు తొలుత ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. విజయ యాత్ర మహోత్సవంలో భాగంగా గుంటూరు పర్యటనకు విచ్చేసిన స్వామీజీ మంగళవారం రాత్రి వీవీఐటీ ఆహ్వానం మేరకు కళాశాలను సందర్శించారు. విద్యార్థులకు అనుగ్రహ భాషణం చేశారు. విద్యార్థులంటే దేశ బంగారు భవిష్యత్ అన్నారు. ఆధునిక విద్య అందించడం ద్వారా దేశ భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని పేర్కొన్నారు. మంచి లక్ష్యం ఎంచుకుని సాధించేలా కృషి చేయాలని సూచించారు. దేశం, ధర్మం రెండు కళ్ల వంటివి అన్నారు. వాటిని మనం పరిరక్షించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ వాసిరెడ్డి మహదేవ్, సెక్రటరీ బదరీ ప్రసాద్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
పంటల బీమా ప్రీమియానికి 15 వరకు గడువు
కొరిటెపాడు(గుంటూరు): ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం ద్వారా రైతుల నమోదు ప్రక్రియ రబీ 2024–25 పంటల కోసం ప్రారంభమైంది. ఈ మేరకు జిల్లా వ్యవసాయ శాఖాధికారి నున్నా వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రబీలో మొక్కజొన్న, జొన్న, మినుము, పెసర, పప్పు శనగ పంటలు సాగు చేసే రైతులు డిసెంబర్ 15వ తేదీలోపు బీమా ప్రీమియం చెల్లించాలని సూచించారు. మొక్కజొన్న ఎకరాకు ప్రీమియం రూ.114, జొన్నకు రూ.48, మినుముకు రూ.50, పెసరకు రూ.45, పప్పు శనగ ఎకరాకు రూ.70 చొప్పున చెల్లించాలని పేర్కొన్నారు. బ్యాంక్‌ల నుంచి రుణం పొందిన రైతులు తమ బ్యాంకుల ద్వారా ఆటోమేటిక్‌గా నమోదై ఉంటారని, రుణం పొందని రైతులు సమీప కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి ప్రీమియం చెల్లించి నమోదు చేయించుకోవాలని కోరారు. నమోదు కోసం ఆధార్ కార్డు, సీసీఆర్‌సీ లేదా లీజు ఒప్పంద పత్రం, పంట, సాగు విస్తీర్ణ సర్టిఫికెట్, బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పించాలని సూచించారు. ప్రీమియం చెల్లించిన రైతులు విధిగా ఈ–క్రాప్ నమోదు చేయించుకోవాలని కోరారు.
16న విజ్ఞాన్‌్‌లో వర్క్‌షాప్
చేబ్రోలు: గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్‌న్ యూనివర్సిటీలో డిసెంబర్ 16 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్నేషనల్ వర్క్‌షాప్‌ను నిర్వహించనున్నట్లు వర్సిటీ వైస్ చాన్సలర్ కల్నల్, ప్రొఫెసర్ పి. నాగభూషణ్ తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బ్రోచర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైస్ చాన్సలర్ మాట్లాడుతూ.. ఇన్నోవేషన్‌న్స్ ఈ–మెషిన్‌న్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటాసైనన్స్ అండ్ మోడలింగ్ అనే అంశంపై హైబ్రిడ్ మోడ్‌లో వర్క్‌షాప్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలు విభాగాధిపతులు పాల్గొన్నారు.
వ్యాయామ
ఉపాధ్యాయుడు సస్పెన్షన్
గుంటూరు ఎడ్యుకేషన్: తాడికొండ మండలం పొన్నెకల్లులోని డీవీకేఆర్ జెడ్పీ ఉన్నత పాఠశాల వ్యాయామ విద్య ఉపాధ్యాయుడు వై. రాజారెడ్డిని సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. గత నెల 24న పాఠశాలకు గైర్హాజరైన 9వ తరగతి విద్యార్థి షేక్ సమీర్ ప్రమాదవశాత్తూ బావిలో పడి మరణించిన ఘటన విదితమే. పాఠశాల చివరి పీరియడ్‌లో గోడ దూకి బయటకు వెళ్లిన తొమ్మిది మంది విద్యార్థులు సమీర్‌తో కలిసి ఈతకు వెళ్లిన సంఘటనలో ప్రధానోపాధ్యాయురాలితోపాటు వ్యాయామ విద్య ఉపాధ్యాయుడు నిర్లక్ష్య వైఖరే కారణమని ఉప విద్యాశాఖాధికారి నివేదిక సమర్పించారు. దాని ఆధారంగా పీడీని డీఈవో రేణుక సస్పెండ్ చేశారు. హెచ్‌ఎం జరీనా ముంతాజ్ బేగంపై చర్యల నిమిత్తం ఆర్జేడీ బి. లింగేశ్వరరెడ్డికి నివేదిక సమర్పించారు.
బెయిల్ పిటిషన్లు డిస్మిస్
నగరంపాలెం: బోరుగడ్డ అనిల్ బెయిల్ పిటిషన్లను బుధవారం జడ్జి డిస్మిస్ చేశారు. గుంటూరు అరండల్‌పేట పీఎస్‌లో అతనిపై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఆ రెండు కేసుల్లో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను గుంటూరు ఐదో జూనియర్ డివిజన్ సివిల్ జడ్జి లత డిస్మిస్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment