మధ్యవర్తిత్వంతో కేసుల పరిష్కారానికి కృషి
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): మధ్యవర్తిత్వం ద్వారా కక్షిదారులు కేసులు పరిష్కరించుకుని సమయం, ధనం వృథా కాకుండా చూసు కోవాలని సుప్రీంకోర్టు మీడియేషన్, కాన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ ప్రతినిధులు ఆచార్య అడ్వకేట్ ప్రమీల (రాజస్థాన్), ఆచార్య అడ్వకేట్ వి.పి.తంకచన్ (కేరళ) చెప్పారు సుప్రీంకోర్టు మీడియేషన్, కాన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ (న్యూఢిల్లీ), రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఎంపికైన న్యాయాధికారులకు మధ్యవర్తిత్వంపై 40 గంటల శిక్షణ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలో గురువారం జిల్లా కోర్టు ఆవరణలోని ది గుంటూరు బార్ అసోసియేషన్ హాల్‌లో న్యాయవాదులకు అవగాహన సదస్సు నిర్వహించారు. శిక్షణ అధికారులు మాట్లాడుతూ మధ్యవర్తిత్వం బాగా ప్రాచూర్యం పొందిందని చెప్పారు. న్యాయవాదులు మధ్యవర్తిత్వం ద్వారా కేసులను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ వై.వి.ఎస్.బి.జి.పార్థసారథి, జిల్లా కార్యదర్శి టి.లీలావతి, సీనియర్ న్యాయమూర్తులు, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అనురాధ, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎస్‌బీఏ ఝాన్సీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment