No Headline
భోగి మంట చుట్టూ చేరి నృత్యం చేస్తున్న విద్యార్థినులు
పెదకాకాని : నంబూరు వివాది స్కూల్లో గురువారం సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. రంగవల్లులు, గొబ్బెమ్మలు, గడ్డివాములు, ధాన్యపు బస్తాలతో వివా పాఠశాల ప్రాంగణం కళకళలాడింది. ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. వివా వీవీఐటీ సంస్థల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, అరుణప్రియ దంపతులు భోగి మంట వేసి సంబరాలను ప్రారంభించారు. చిన్నారుల సంప్రదాయ వేషధారణలు, నృత్యాలు, గీతాలాపనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో వివా డైరెక్టర్ ఎల్.టి. కమాండర్ కె.శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ డాక్టర్ సీహెచ్ సరళ, వివా గుంటూరు క్యాంపస్ హెడ్ మామిళ్లపల్లి వేదవాణి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment