అధికారులపై రెచ్చిపోయిన టీడీపీ నేతలు
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): గుంటూరు జీటీ రోడ్డులో ఓ సామాజికవర్గానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడి విగ్రహ ఏర్పాటును అనుమతుల్లేని కారణంగా అడ్డుకున్న అధికారులపై బుధవారం రాత్రి టీడీపీ నేతలు రెచ్చిపోయారు. ఆర్‌అండ్‌బీ, నగరపాలక సంస్థ, పోలీస్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. కలెక్టరేట్ రోడ్డుకు ఎదురుగా జీటీ రోడ్డు మధ్యలో అధికారులు ప్రమాదాల నివారణకు సెంటర్ డివైడర్‌ను, సిమెంట్ దిమ్మెలను ఏర్పాటు చేశారు. ఈ ప్రదేశంలో స్వాతంత్య్ర సమరయోధుడి విగ్రహ ఏర్పాటుకు టీడీపీ నేతలు బుధవారం రాత్రి సన్నాహాలు చేపట్టారు. అనుమతులు లేకపోవడంతో ఆర్‌అండ్‌బీ డీఈ, నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు ఆ ప్రదేశానికి చేరుకుని అనుమతి లేదని చెప్పారు. దీంతో టీడీపీ నేతలు అధికారులపై దురుసుగా ప్రవర్తించారు. వాగ్వాదం జరిగింది. ఎంతసేపటికి టీడీపీ నేతలు వినకపోవడంతో ఆర్‌అండ్‌బీ అధికారులు నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీతోపాటు పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని పనులను నిలిపివేశారు. విషయం తెలుసుకున్న పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి, అనుచరులతో అర్ధరాత్రి ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ద్వితీయశ్రేణి నాయకులు అధికారులపై దురుసుగా ప్రవర్తించారు. ట్రాన్స్‌ఫర్ చేస్తామంటూ హెచ్చరించారు. అయినా అధికారులు విగ్రహ ఏర్పాటు పనులను పూర్తిగా నిలిపివేశారు.
అనుమతుల్లేకుండా జరుగుతున్న విగ్రహ ఏర్పాటును అడ్డుకున్నారని అక్కసు ఎమ్మెల్యే మాధవితోపాటు ద్వితీయశ్రేణి నేతల దౌర్జన్యం
Comments
Please login to add a commentAdd a comment