టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి
మరొకరికి గాయాలు
మంగళగిరి (తాడేపల్లి రూరల్): మంగళగిరి పట్టణ పరిధిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కాలనీ అండర్‌పాస్ సమీపంలో గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే సర్వీస్ రోడ్‌లో ఆదివారం రాత్రి ప్రమాదం జరిగింది. ఓ టిప్పర్ స్కూటీపై ప్రయాణిస్తున్న ఇద్దరిని ఢీకొట్టడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరికి గాయాలయ్యాయి. సేకరించిన వివరాల ప్రకారం.. మంగళగిరి భార్గవ పేటకు చెందిన జొన్నాదులు శ్రీనివాస్, కేసనం కోటేశ్వరరావు (42) స్నేహితులు. చినకాకానిలోని బంధువుల ఇళ్ల దగ్గర పాలు తీసుకోవడానికి వెళ్లి తిరిగి వస్తుండగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కాలనీ అండర్‌పాస్ వద్దకు రాగానే వెనుక నుంచి టిప్పర్ వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో కోటేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందగా, శ్రీనివాస్‌కు గాయాలయ్యాయి. మృతి చెందిన కేసనం కోటేశ్వరరావు బంగారుపు పని చేస్తాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లోనే ఉంటున్నాడు. కోటేశ్వరరావుకు భార్యతో పాటు 10వ తరగతి చదివే కుమార్తె ఉంది. మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మట్టి లోడ్‌తో వెళుతున్న టిప్పర్ డ్రైవర్ లారీతో సహా పరారీ కావడంతో స్థానికులు వెంబడించి పోలీసులకు అప్పగించారు.
గాయపడిన శ్రీనివాస్
Comments
Please login to add a commentAdd a comment