గుంటూరు | - | Sakshi
Sakshi News home page

గుంటూరు

Published Mon, Feb 3 2025 1:49 AM | Last Updated on Mon, Feb 3 2025 1:50 AM

గుంటూ

గుంటూరు

సోమవారం శ్రీ 3 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025

పోలీసులమని భయపెట్టి ఆన్‌లైన్‌లో దోపిడీ

పట్నంబజారు: ఉమెన్‌ ట్రాఫికింగ్‌కు పాల్పడే వ్యక్తి వద్ద నీ ఆధార్‌ ఉందని.. డబ్బులు కట్టకుంటే అరెస్ట్‌ చేస్తామని వాట్సాప్‌ కాల్‌ ద్వారా భయపెట్టడంతో వ్యక్తి ఏకంగా రూ 24లక్షలు వారికి పంపిన ఘటనపై కేసు నమోదైంది. కొత్తపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెహూన్రగర్‌కు చెందిన వంకాయల నాగేశ్వరరావు (65) పురుగు మందుల వ్యాపారం చేసి ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నారు. ఈ క్రమంలో జనవరి 28న వాట్సాప్‌ ఫోన్‌ కాల్‌ వచ్చింది. తాను బెంగుళూరు పోలీసునని, పేరు శివప్రసాద్‌ అని, తాము ఉమెన్‌ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని తెలిపాడు. ఆ వ్యక్తి వాడుతున్న సిమ్‌కార్డు మీ పేరుతో ఉందని, దీంతో పాటు అతడు రూ. 30లక్షలు ఇచ్చినట్లు చెబుతున్నాడని మాయమాటలు చెప్పాడు. ఆ డబ్బులు కట్టకుంటే అరెస్ట్‌ చేస్తామని నాగేశ్వరరావును భయభ్రాంతులకు గురి చేశాడు. దీంతో ఆయన భయపడి ధపాలు వారీగా తన బ్యాంకు అకౌంట్ల నుంచి ఆర్‌టీజీఎస్‌ ద్వారా రూ. 24లక్షల పంపించాడు. అయినప్పటికీ సైబర్‌ నేరగాళ్లు ఇంకా డబ్బులు పంపాలని డిమాండ్‌ చేస్తుండటంతో విషయాన్ని నాగేశ్వరరావు కుటుంబసభ్యుల దృష్టికి తీసుకుని వెళ్లాడు. దీంతో ఆదివారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నేడు ప్రజా ఫిర్యాదుల

పరిష్కార వేదిక రద్దు

పట్నంబజారు: పట్టభద్రుల ఎమ్మెల్సీ కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఎస్‌. సతీష్‌కుమార్‌ తెలిపారు. ఈ నెల 3న జరగాల్సిన కార్యక్రమాన్ని రద్దు చేసిన విషయాన్ని ప్రజలు, ఫిర్యాదుదారులు, బాధితులు గమనించాలని ఆయన తెలియజేశారు.

పట్నంబజారు: కేవలం రెండు రోజుల వ్యవధిలో మూడు ప్రమాదాలు.. కళ్ల ముందే ఐదుగురు చనిపోయిన పరిస్థితులు జిల్లాలో ప్రమాదాల తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ జనవరి ఒక్క నెలలోనే 30 మంది మృత్యువాత పడ్డారు. ముఖ్యంగా బైక్‌ ప్రమాదాలే అధికంగా ఉంటున్నాయి. హెల్మెట్‌ ధరించకపోవడం కారణంగానే తలపై తీవ్ర గాయాలతో మృత్యువాత పడుతున్నారు. అతివేగం, నిర్లక్ష్యం, మద్యం తాగడం, డ్రైవింగ్‌ చేస్తూ సెల్‌ఫోన్‌ మాట్లాడటం.. కారణం ఏదైనా నిండు ప్రాణాలు బలైపోతున్నాయి. ఒక కుటుంబం ఇంటి పెద్దను కోల్పోతే, పరిణామం కన్నీటి పర్యంతరమే. రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తే, నిండు నూరేళ్లు జీవితంలో ఒడుదుడుకులే ఉండవన్న విషయాన్ని వాహనదారులు గుర్తించాలి.

నాలుగేళ్లలో పలు ప్రమాదాలు

అధిక శాతం ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారులే మృత్యువాత పడుతున్నారని రవాణా అధికారులు స్పష్టంగా చెబుతున్నారు. మృతి చెందిన ఘటనల్లో 45శాతానికి పైగా బైక్‌ల ప్రమాదాలు ఉంటున్నారు. ఇందులో 88శాతం పురుషులే మృతి చెందుతున్నారు. అధిక శాతం హైవే రోడ్లు మాత్రమే వినియోగిస్తున్నారని, సర్వీసు రోడ్లును సైతం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందనే సూచిస్తున్నారు.

కేసులు నమోదు చేసినా ఫలితం శూన్యం

నిత్యం ట్రాఫిక్‌, ఆర్టీఏ అధికారులు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నప్పటీకీ వాహనదారుల్లో మార్పు రావటం లేదు. ఇప్పటికే కళాశాలలకు బైక్‌లు తీసుకుని రావద్దని పలు యాజమాన్యాలు విద్యార్థులకు చెప్పడంతో పాటు, తీసుకుని వచ్చిన వారిని లోపలికి రానివ్వకుండా అవగాహన కల్పిస్తున్నాయి. అయినప్పటికీ ఫలితం లేదు. ముఖ్యంగా మైనర్‌లు గుంటూరు నగరంతో పాటు, జిల్లావ్యాప్తంగా ద్విచక్ర వాహనాలు నడిపి ప్రమాదాలకు గురవుతూ, ఇతరులను కూడా ప్రమాదాల బారిన పడేస్తున్నారు. నిత్యం హెల్మెట్‌ పెట్టుకోవాలని అధికారులు చెబుతున్నప్పటికీ, వాహనదారుల్లో మాత్రం మార్పు రావడం లేదు.

7

న్యూస్‌రీల్‌

రూ. 24లక్షలు పంపిన వృద్ధుడు నకిలీ అని తేలడంతో పోలీసులను ఆశ్రయించిన బాధితుడు

కళ్లముందే ప్రాణాలు పోతున్నాయి జనవరిలోనే 30 మంది జిల్లాలో మృత్యువాత యువకులే అధికం ద్విచక్ర వాహనాల ప్రమాదాలు ఎక్కువ

ఒక్క జనవరిలోనే మృత్యు ఘంటికలు

సరదాగా స్నేహితులతో కలిసి వెళ్లిన ఒక మైనర్‌ బాలుడు.. ట్రాక్టర్‌ను ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు.

ఏటుకూరు రోడ్డు బైపాస్‌లో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొట్టుకుని ముగ్గురు మృత్యువాత పడ్డారు.

ఓబులునాయుడు పాలెం వద్ద డీవైడర్‌ను ఢీకొట్టి ఒక వ్యక్తి మృతి చెందాడు.

మైనర్‌ బాలుడు ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ఘటనలో మరో మైనర్‌ బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత

ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో అధికంగా మృత్యువాత పడిన సంఘటనలు హెల్మెట్‌ ధరించకపోవటం వల్లే జరిగాయి. రోడ్డు భత్రతను ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలి. అతివేగం, నిర్లక్ష్యం, మద్యం తాగడం, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ వల్లే అధిక ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాల్లో 18 ఏళ్ల నుండి 40 ఏళ్లలోపు వారే అధికంగా మృతి చెందుతున్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్‌ ధరించి వాహనాలు నడపాలని సూచిస్తున్నాం. మైనర్‌లకు వాహనాలు ఇవ్వడం వల్ల కూడా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రైవింగ్‌ చేసే ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి.

– కె. సీతారామిరెడ్డి (డీటీసీ, గుంటూరుజిల్లా)

ప్రత్యేక డ్రైవ్‌లు

చేపడుతూనే ఉన్నాం

జిల్లాలో మైనర్‌లు, యువత, విద్యార్థుల ర్యాష్‌, త్రిపుల్‌ డ్రైవింగ్‌, స్నేక్‌ డ్రైవింగ్‌లపై ఎప్పటికప్పుడు స్పెషల్‌ డ్రైవ్‌లు నిర్వహిస్తూనే ఉన్నాం. ముఖ్యంగా హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలని అవగాహన కార్యక్రమాలు చేపట్టాం. ప్రజల్లో మార్పు రావాలి. కేవలం పోలీసు ఉంటారని హెల్మెట్‌ పెట్టుకోవటం కాదు.. వారి ప్రాణరక్షణకు పెట్టుకోవాలి. తద్వారా ప్రమాదాలను అరికట్టగలం. మార్చి ఒకటో తేదీ నుంచి జరిమానాలు కూడా భారీగా మారుతున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్‌లో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎన్నో దుర్ఘటనలు నిలువరించిన వారవుతాం.

–ఎస్‌. సతీష్‌కుమార్‌ (ఎస్పీ, గుంటూరు జిల్లా)

జిల్లావ్యాప్తంగా ప్రమాదాల వివరాలు

సంవత్సరం ప్రమాదాలు మరణాలు గాయాలు

2021 1047 431 913

2022 1071 397 1011

2023 972 352 912

2024 1042 442 1143

2025 25 30 70 (జనవరిలో)

No comments yet. Be the first to comment!
Add a comment
గుంటూరు1
1/9

గుంటూరు

గుంటూరు2
2/9

గుంటూరు

గుంటూరు3
3/9

గుంటూరు

గుంటూరు4
4/9

గుంటూరు

గుంటూరు5
5/9

గుంటూరు

గుంటూరు6
6/9

గుంటూరు

గుంటూరు7
7/9

గుంటూరు

గుంటూరు8
8/9

గుంటూరు

గుంటూరు9
9/9

గుంటూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement